Woman Climber: భారతీయ పర్వతారోహకురాలు బల్జీత్‌కౌర్ క్షేమం, రేడియో కాంటాక్ట్ సిగ్నల్స్ ద్వారా గుర్తింపు
ABN, First Publish Date - 2023-04-18T19:23:14+05:30
పర్వత శిఖరం నుంచి దిగుతుండగా సోమవారం సాయంత్రం ఆమె మిస్సయినట్లు యాత్ర నిర్వాహకులు తెలిపారు. షెర్పా ప్రకారం(according to Sherpa), మంగళవారం ఉదయం వరకు రేడియో కాంటాక్ట్ సిగ్నల్ ద్వారా ఆమెను..
ఖాట్మండు: భారతీయ మహిళా పర్వతారోహకురాలు(Indian Woman Climber) బల్జీత్ కౌర్(Baljeet Kaur) (27) క్షేమంగా ఉన్నారు. మంగళవారం వైమానిక శోధన బృందం(An Aerial Aearch Team) కౌర్‌ను గుర్తించింది. ఎటువంటి సప్లిమెంటల్ ఆక్సిజన్(Supplemental Oxygen) లేకుండా ప్రపంచంలోనే 10వ అత్యంత ఎత్తయిన పర్వతాన్ని(World’s 10th Highest Peak) కౌర్ అధిరోహించారు. పర్వత శిఖరం నుంచి దిగుతుండగా సోమవారం సాయంత్రం ఆమె మిస్సయినట్లు యాత్ర నిర్వాహకులు తెలిపారు. షెర్పా ప్రకారం(according to Sherpa), మంగళవారం ఉదయం వరకు రేడియో కాంటాక్ట్ సిగ్నల్ ద్వారా ఆమెను గుర్తించారు.
మంగళవారం ఉదయం ఆమె 'తక్షణ సహాయం' కోరుతూ రేడియో సిగ్నల్‌ను పంపిన తర్వాత వైమానిక శోధన మిషన్ ఆమెకోసం సెర్చింగ్ ప్రారంభించింది. షెర్పా ప్రకారం, ఆమె GPS స్థానం 7,375m (24,193ft) ఎత్తులో ఉన్నట్లు సూచించింది. మూడు హెలికాప్టర్లను ఆమె జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా సోమవారం సాయంత్రం 5:15 గంటలకు ఆమె ఇద్దరు షెర్పా గైడ్‌లతో కలిసి అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించింది.
గత ఏడాది మేలో, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కౌర్, లొట్సే పర్వతాన్ని అధిరోహించి, ఒకే సీజన్‌లో నాలుగు 8000 మీటర్ల శిఖరాలను అధిరోహించిన మొదటి భారతీయ అధిరోహకురాలిగా నిలిచింది.
సోమవారం, రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్‌కు చెందిన అనురాగ్ మాలు అనే పర్వాతారోహకుడు మౌట్ అన్నపూర్ణ III క్యాంప్ నుంచి దిగుతుండగా అదృశ్యమయ్యాడు. అయితే క్యాంప్ IV నుంచి దిగుతుండగా 6,000 మీటర్ల దగ్గర లోయలో పడి మాలు మరణించినట్లు తెలిసింది.
కాగా మౌట్ అన్నపూర్ణ ప్రపంచంలోని పదవ ఎత్తైన పర్వతం, ఇది సముద్ర మట్టానికి 8,091 మీటర్ల ఎత్తులో ఉంది.
Updated Date - 2023-04-18T19:23:14+05:30 IST