ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israel-Hamas War: గాజా యుద్ధం ఆపే సామర్థ్యం భారత్‌కి ఉందా.. ఇరాన్ రాయబారి ఏం చెప్పారంటే?

ABN, First Publish Date - 2023-11-02T21:02:38+05:30

హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధాన్ని ఆపే సామర్థ్యం భారతదేశానికి ఉందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇచ్చారు భారత్‌లోని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఎలాహి. ప్రపంచ వేదికపై భారతదేశపు నైతికత..

హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధాన్ని ఆపే సామర్థ్యం భారతదేశానికి ఉందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇచ్చారు భారత్‌లోని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఎలాహి. ప్రపంచ వేదికపై భారతదేశపు నైతికత, మానవత్వంపై ప్రశంసలు కురిపిస్తూ.. ప్రస్తుతం గాజా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడంలో కీలక పాత్ర పోషించగల సామర్థ్యం భారత్‌కి ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన.. గాజాలో ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న భూతల దాడుల్ని తీవ్రంగా ఖండించారు.

ఓ మీడియా సంస్థతో ఇరాజ్ మాట్లాడుతూ.. ‘‘నైతిక ధైర్యాన్ని, అణచివేయలేని మానవ స్ఫూర్తిని ప్రదర్శించడంలో భాతరదేశం గొప్ప చరిత్రను కలిగి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే.. గాజాలో జరుగుతున్న మారణహోమం పట్ల భారత్ కళ్లు మూసుకొని ఉండదని నేను దృఢంగా విశ్వసిస్తున్నా. గాజాలో జియోనిస్టులు (ఇజ్రాయెల్) విధించిన క్రూరత్వాలను అంతం చేయడంలో భారతదేశం కీలక పాత్ర పోషించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది’’ అని అన్నారు. భారతదేశం గ్లోబల్ సౌత్ వాయిస్‌గా మారాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. పాలస్తీనాలోని ప్రజల సమస్యలపై చర్చించకుండానే చర్చించలేమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ బోధనల ప్రభావం, పాలస్తీనాపై ఆయన స్ఫూర్తిదాయకమైన పదాలు.. అందరి సామూహిక స్మృతిలో నిలిచిపోయాయని చెప్పారు.


ప్రస్తుత పరిస్థితులు.. గ్లోబల్ సౌత్ స్వరంగా మారే ప్రధాన అవకాశాన్ని భారత్‌కి అందిస్తున్నాయని ఇరాజ్ అన్నారు. గత మూడు వారాల నుంచి గాజాలో ఇజ్రాయెల్ దురాగతాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని.. అంతర్జాతీయ చట్టం, సార్వత్రిక నైతిక విలువలను ఆ దేశం అగౌరవపరిచిందని మండిపడ్డారు. అంతర్జాతీయ, గ్లోబల్ ఇన్స్‌టిట్యూడ్స్ ఆమోదించబడిన తీర్మానాలను వారు పదేపదే విస్మరించారని దుయ్యబట్టారు. UNGA తీర్మానానికి వాళ్లు అనుగుణంగా ఉండరని తేలిపోయిందని, గాజాలో క్రూరమైన చర్యలను కొనసాగించాలని నిర్ణయించిందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. పాలస్తీనా ప్రజల కోసం భారతదేశం పంపిన మానవతా సహాయానికి గాను ఆయన ధన్యవాదాలు తెలుపారు.

ఇదిలావుండగా.. అక్టోబర్ 7వ తేదీ నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలుత హమాస్ మెరుపుదాడులు చేయడంతో పాటు వందలాది మంది ఇజ్రాయిలీలను అపహరించుకుపోగా.. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాలోని హమాస్‌పై విరుచుకుపడుతోంది. గాజాలో వైమానిక దాడులు, గ్రౌండ్ ఆపరేషన్స్‌తో నిర్వహించడంతో పాటు ఆహారం, ఇంధనం, విద్యుత్ సరఫరాలపై నిషేధం విధించి గాజాను దిగ్బంధించింది. ఇలా.. ఓవైపు నిత్యవసరాల కొరత, మరోవైపు దాడుల మధ్య గాజాలోని సామాన్య పౌరులు మరణిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ దాడుల్లో సుమారు 10 వేల మందికి పైగా మరణించారని సమాచారం.

Updated Date - 2023-11-02T21:02:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising