ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

S Somanath: చంద్రయాన్-3తో కథ ముగియలేదు.. ముందుంది ముసళ్ల పండగ.. టాప్ సీక్రెట్ చెప్పిన ఇస్రో ఛైర్మన్

ABN, Publish Date - Dec 14 , 2023 | 10:34 PM

ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌తో చంద్రునిపై ఆసక్తి ఇంకా ముగియలేదని.. దాని ఉపరితలంపై ఉండే రాళ్లను తీసుకురావాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చూస్తోందని అన్నారు.

S Somanath On Moon Rocks: ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌తో చంద్రునిపై ఆసక్తి ఇంకా ముగియలేదని.. దాని ఉపరితలంపై ఉండే రాళ్లను తీసుకురావాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చూస్తోందని అన్నారు. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ (RBCC)లో ఆయన మాట్లాడుతూ.. చంద్రుడి నుండి రాళ్లను తీసుకొచ్చేందుకు గాను ‘నమూనా రిటర్న్ మిషన్’ వివరాల్ని పంచుకున్నారు.

‘‘చంద్రునిపై మా అభిరుచి ఇంకా ముగియలేదు. చంద్రుని రాళ్లను మేము భూమికి తీసుకొస్తామని రాష్ట్రపతికి హామీ ఇస్తున్నా’’ అని ఎస్ సోమనాథ్ అన్నారు. అయితే.. ఇది అంత సులభమైన మిషన్ కాదని ఆయన పేర్కొన్నారు. చంద్రుని ఉపరితలంపైకి వెళ్లి తిరిగి రావాలన్నా.. అక్కడున్న వాటిని రికవర్ చేయాలన్నా.. అక్కడ ల్యాండ్ చేయడం దాని కన్నా ఎక్కువ సాంకేతికత అవసరం అవుతుందని అన్నారు. శాంపిల్ రిటర్న్ మిషన్ అనేది చాలా సంక్లిష్టమైనదని, మానవ ప్రమేయం లేకుండా ప్రతిదీ స్వయంప్రతిపత్తితో చేయాల్సి ఉంటుందని తెలిపారు. రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఈ మిషన్‌ని చేపట్టాలని అనుకుంటున్నామని, ఇదే తమ లక్ష్యమని చెప్పారు.


ఇదే సమయంలో ఒక భారతీయుడ్ని అంతరిక్షంలోకి పంపే మిషన్ పరిశీలనలో ఉందని సోమనాథ్ చెప్పారు. ‘‘మేము మానవుల్ని చాలా సురక్షితంగా అంతరిక్షంలోకి పంపుతాము. వారిని సురక్షితంగా తిరిగి తీసుకొస్తాం కూడా! ఈ మిషన్ భద్రత కోసం చాలా కసరత్తులు చేస్తున్నాం’’ అని వెల్లడించారు. స్పేస్ స్టేషన్‌ను నిర్మించాలనేది కూడా తమ కోరిక అని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాని సన్నాహాల్ని సమీక్షించారని అన్నారు. 2035 నాటికి అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. మానవులు వెళ్ళడానికి, డాకింగ్ చేసి పని చేసేందుకు ఒక కార్యాచరణ అంతరిక్ష కేంద్రమని, దీనిపై పని చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించకముందే.. దాని మొదటి మాడ్యూల్‌ని 2028 నాటికి ఇస్రో ప్రారంభిస్తుందని సోమనాథ్ చెప్పారు. అది రోబోటిక్ స్పేస్ స్టేషన్ అవుతుందని, అయితే మానవ సహిత అంతరిక్ష కేంద్రం 2035 నాటికి మాత్రమే వస్తుందని వివరణ ఇచ్చారు. ఎందుకంటే.. దాన్ని చేసేందుకు కొత్త రాకెట్లు అవసరం అవుతాయని వివరించారు. గగన్యాన్ కార్యక్రమం కూడా కొనసాగుతోందని చెప్పారు. భారతీయులను అంతరిక్షంలోకి పంపడం ఒక్కటే తమ లక్ష్యం కాదని.. మానవులను నిరంతరం అంతరిక్షంలోకి పంపడం, దానిపై పని చేయడం, సాంకేతిక సామర్థ్యాలను మరింతగా సృష్టించడం లక్ష్యమని సోమనాథ్ తన ప్రసంగంలో తెలిపారు.

Updated Date - Dec 14 , 2023 | 10:34 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising