ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసిన ఇస్రో.. ఆ మూడింటిపై కీలక ప్రకటన

ABN, First Publish Date - 2023-08-24T20:30:44+05:30

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గురువారం ‘చంద్రయాన్-3’ మిషన్‌కి సంబంధించి ‘X’ ఫ్లాట్‌ఫార్మ్ (ట్విటర్) మాధ్యమంగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. షెడ్యూల్స్ ప్రకారమే యాక్టివిటీస్ కొనసాగుతున్నాయని..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గురువారం ‘చంద్రయాన్-3’ మిషన్‌కి సంబంధించి ‘X’ ఫ్లాట్‌ఫార్మ్ (ట్విటర్) మాధ్యమంగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. షెడ్యూల్స్ ప్రకారమే యాక్టివిటీస్ కొనసాగుతున్నాయని.. సిస్టమ్స్ అన్నీ సాధారణ స్థితిలో ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది. లాండర్ మాడ్యూల్ పేలోడ్స్ అయిన ఇల్సా (ILSA), రంభ (RAMBHA), ఛాస్ట్ (ChaSTE) ఈరోజు యాక్టివ్ (ఆన్) అయ్యాయని పేర్కొంది. రోవర్ మొబిలిటీ కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పిన ఇస్రో.. ఆదివారమే ప్రొపల్షన్ మాడ్యూల్‌పై SHAPE పేలోడ్ ఆన్ అయినట్టు వెల్లడించింది.


కాగా.. ఇస్రో సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌ని జులై 14వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో లాంచ్ చేసింది. 41 రోజుల పాటు ఇది ప్రయాణం చేసి.. ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 6:02 గంటలకు చంద్రుడి ఉపరితలంపై కాలు మోపింది. దీంతో.. చంద్రుడిపై సాఫ్ట్‌ల్యాండ్ చేసిన నాలుగు దేశంగా భారత్ నిలిచింది. అంతేకాదు.. దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగానూ భారత్ చరిత్ర సృష్టించింది. నిజానికి.. నాలుగు సంవత్సరాల క్రితమే భారత్ చంద్రయాన్-2తో ఆ ఘనత సాధించాలని ఇస్రో భావించింది. కానీ.. చివరి నిమిషంలో సంబంధాలు తెగిపోవడంతో, అది క్రాష్ ల్యాండింగ్ అయ్యింది.

ఆ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో సంస్థ.. ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా సాఫ్ట్ ల్యాండ్ అయ్యేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫైనల్‌గా అనుకున్నది సాధించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని ల్యాండ్ చేసి.. అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రదేశాలకు సవాల్ విసిరారు. మరో విశేషం ఏమిటంటే.. ఈ ప్రాజెక్ట్ 615 కోట్లలోనే పూర్తయ్యింది. ఇందులోని రోవర్ 14 రోజుల పాటు చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు జరిపి.. ఆ వివరాల్ని ఇస్రోకి పంపనుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం అవ్వడంతో.. చంద్రయాన్-4 కూడా ఇస్రో సంస్థ ప్లాన్ చేస్తోంది.

Updated Date - 2023-08-24T20:30:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising