ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: కీలక ఘట్టం.. స్లీప్ మోడ్‌లో నుంచి బయటకు రానున్న ల్యాండర్, రోవర్.. కానీ!!

ABN, First Publish Date - 2023-09-21T22:24:37+05:30

చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌కు రేపు (శుక్రవారం) ఎంతో కీలకమైన దినం. ఎందుకంటే.. రేపే చంద్రునిపై సూర్యోదయం కానుంది. దీంతో.. చంద్రుని ఉపరితలంపై గత 16 నుంచి స్లీప్ మోడ్‌లో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి...

చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌కు శుక్రవారం ఎంతో కీలకమైన దినం. ఎందుకంటే.. శుక్రవారమే చంద్రునిపై సూర్యోదయం కానుంది. దీంతో.. చంద్రుని ఉపరితలంపై గత 16 నుంచి స్లీప్ మోడ్‌లో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి మేల్కోనున్నాయి. ఈ అంశంపై ఇస్రోలోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎస్ఏసీ) డైరెక్టర్ నీలేష్ దేశాయ్ గురువారం మాట్లాడుతూ.. తాము సెప్టెంబర్ 22వ తేదీన ల్యాండర్, రోవర్‌లను తిరిగి యాక్టివేట్ చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఒకవేళ అదృష్టం కలిసొస్తే.. అవి తిరిగి యాక్టివేట్ అవుతాయని అన్నారు. అదే జరిగితే.. చంద్రుని ఉపరితలాన్ని మరింత పరిశోధించడానికి మరికొంత ప్రయోగాత్మక డేటాను పొందుతామని చెప్పారు.


కాగా.. ల్యాండర్, రోవర్‌లు ప్రస్తుతం చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో స్లీప్ మోడ్‌లో ఉన్నాయి. చంద్రునిపై సూర్యకాంతి తిరిగొచ్చాక, ఆ సూర్యుని వెలుగుని గ్రహించి సోలార్ ప్యానెల్‌లు త్వరగా ఛార్జ్ అవుతాయి. అప్పుడు.. మరో 14 రోజుల పాటు చంద్రునిపై ప్రయోగాలు చేసేందుకు వీలుంటుంది. చంద్రునిపై రాత్రి సమయంలో ఉష్ణోగ్రత మైనస్ 120-200 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గుతుందని.. అందుకే తాము ల్యాండర్, రోవర్‌లను స్లీప్ మోడ్‌లో ఉంచామని నీలేశ్ యాదవ్ తెలిపారు. చంద్రునిపై తిరిగి సూర్యోదయం అవ్వగా.. సోలార్ ప్యానెల్స్, ఇతర పరికరాలు తిరిగి పూర్తిగా ఛార్జ్ అవుతాయని తాము ఆశిస్తున్నామన్నారు. అందుకే.. తాము ల్యాండర్, రోవర్‌లను తిరిగి యాక్టివేట్ చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన వివరణ ఇచ్చారు.

ఇదిలావుండగా.. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ఆగస్టు 23వ తేదీన చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా సాఫ్ల్ ల్యాండింగ్ చేసింది. దీంతో.. చంద్రుని దక్షిణ ధ్రువంపై చేరిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటలకెక్కింది. చంద్రునిపై ల్యాండర్, రోవర్, ఇతర పేలోడ్స్ దిగగానే.. తమ పరిశోధనల్ని సమర్థవంతంగా నిర్వహించి, భూమికి ఎంతో ముఖ్యమైన డేటాను పంపించాయి. అక్కడి ఉష్ణోగ్రత పరిస్థితుల్ని.. సల్ఫర్, ఆక్సిజన్‌తో పాటు ఇతర మూలకాల ఉనికిని గుర్తించాయి. తన పరిశోధనల్లో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ 200 మీటర్ల దూరం ప్రయాణించింది. ఇప్పుడు ఇవి మళ్లీ స్లీప్ మోడ్ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

Updated Date - 2023-09-21T22:32:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising