ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Aditya L-1 Mission: ఇస్రో నెక్ట్స్ టార్గెట్ సూర్యుడు.. సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1 ప్రయోగం.. దీని విశేషాలు ఇవే!

ABN, First Publish Date - 2023-08-26T17:11:38+05:30

చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో.. ఇప్పుడు ఇస్రో సూర్యుడి గురించి అధ్యయనం చేసేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 2వ తేదీన ‘ఆదిత్య ఎల్-1’ సోలార్ మిషన్‌ను ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది...

చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో.. ఇప్పుడు ఇస్రో సూర్యుడి గురించి అధ్యయనం చేసేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 2వ తేదీన ‘ఆదిత్య ఎల్-1’ సోలార్ మిషన్‌ను ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులను తెలుసుకోవడం కోసమే.. ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపడుతోంది. తొలుత ‘ఆదిత్య ఎల్-1’ను భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్-1 (L-1) దగ్గరుండే దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి చేరుస్తారు. మొత్తం 177 రోజుల పాటు ఇది ప్రయాణం చేసి, ఆ కక్ష్యలోకి చేరుకుంటుంది. దీపి ద్వారా.. సూర్యుడి రహస్యాలను కనుగొనవచ్చు. అంటే.. సూర్యుడు ఎలా పుట్టాడు? అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది? అనే వివరాలతో తెలుసుకోవడంతో పాటు కాంతిమండలం (ఫొటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్), సూర్యుని బయటి పొరలపై అధ్యయనం చేస్తారు.


సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు భారత్ ప్రయోగిస్తున్న తొలి స్పేస్ క్రాఫ్ట్ ఇదే! గతంలో అమెరికా, జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు సూర్యుడిపైకి ఉపగ్రహాల్ని పంపాయి. ఒకవేళ ఆదిత్య ఎల్-1 సోలార్ మిషన్ విజయవంతం అయితే.. సూర్యుడిపైకి ఉపగ్రహం పంపిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్‌ని ఉపయోగించి ఈ ‘ఆదిత్య ఎల్-1’ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. పీఎల్ఎల్‌వీ-సీ57 అనే వాహననౌక ఈ ఆదిత్య-ఎల్‌ను మోసుకొని నింగిలోకి దూసుకెళ్లనుంది. కరోనాగ్రఫీ పరికరం సహాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా శోధించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సహకారంతో ఇస్రో ఈ సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టనుందని ఆయన తెలిపారు. అయితే.. ఇది పూర్తి స్వదేశీ స్వదేశీ ప్రయత్నమని ఆయన నొక్కి వక్కాణించారు.

ఈ ‘ఆదిత్య ఎల్-1’లో మొత్తం ఏడు పేలోడ్లు ఉంటాయి. అవి.. 1. విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ), 2. సోలార్‌ అల్ట్రావైలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, 3. ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌, 4. ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, 5. ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, 6. హైఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, 7. మ్యాగ్నెటోమీటర్‌. సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు వీలుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. నాలుగు పేలోడ్స్ నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తే.. మిగతా మూడు పేలోడ్స్ సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి.

Updated Date - 2023-08-26T17:12:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising