ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: 14 రోజుల తర్వాత ఏమవుతోంది.. ఆ రహస్యాలను బయటపెట్టిన ఇస్రో శాస్త్రవేత్త

ABN, First Publish Date - 2023-08-29T18:28:43+05:30

ప్రస్తుతం చంద్రుని ఉపరితలంపై ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. చంద్రుడి నుండి శాస్త్రీయ సమాచారాన్ని సేకరించి, భూమికి పంపుతున్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తం 14 రోజుల పాటు ఈ మిషన్ సాగనుండగా...

ప్రస్తుతం చంద్రుని ఉపరితలంపై ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. చంద్రుడి నుండి శాస్త్రీయ సమాచారాన్ని సేకరించి, భూమికి పంపుతున్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తం 14 రోజుల పాటు ఈ మిషన్ సాగనుండగా, ఇప్పటికే సగం పూర్తయ్యింది. ఉష్ణోగ్రతతో పాటు ఇతర కీలక సమాచారాన్ని ల్యాండర్, రోవర్‌లు పంపించాయి. ఇప్పుడు ఈ మిషన్‌లో కేవలం 7 రోజులే మిగిలి ఉంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. 14 రోజుల మిషన్ పూర్తయ్యాక విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ల పరిస్థితి ఏంటి? అవి పని చేస్తూనే ఉంటాయా, లేదా? వాటిని తిరిగి భూమికి తీసుకొస్తారా? అనే రకరకాల ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి.


ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటికీ చంద్రయాన్-3 మిషన్‌లో భాగమైన ఇస్రో శాస్త్రవేత్త ఎం. శ్రీకాంత్ సమాధానాలు ఇచ్చారు. చంద్రునిపై 14 రోజుల పాటు సూర్యకాంతి ఉంటుందని.. ఈ కాంతి ఉన్నంతవరకు ల్యాండర్, రోవర్ పని చేస్తూనే ఉంటాయని అన్నారు. ఆగస్టు 23వ తేదీన విక్రమ్ ల్యాండర్‌ని చంద్రునిపై ల్యాండ్ చేసినప్పుడు సూర్యకాంతి వచ్చిందని.. అప్పటి నుంచే ల్యాండర్, రోవర్ పని చేయడం మొదలుపెట్టాయని అన్నారు. అయితే.. ఈ 14 రోజుల తర్వాత చంద్రునిపై సూర్యుడు అస్తమించి రాత్రి ప్రారంభమయ్యాక ల్యాండర్, రోవర్ పని చేయడం (ఇన్-యాక్టివ్ మోడ్‌లోకి వెళ్లిపోతాయి) మానేస్తాయని అన్నారు. అయితే.. 14 రాత్రులు గడిచిన తర్వాత చంద్రునిపై సూర్యుడు మళ్లీ ఉదయించినప్పుడు ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ తిరిగి పని చేయొచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ అదే జరిగితే.. మరింత డేటాను సేకరించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఒకవేళ అలా జరగకపోయినా నష్టమేమీ లేదని, ఎందుకంటే ఆలోపే తమ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు.

54 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మాత్రమే పని చేసే విధంగా విక్రమ్, ప్రజ్ఞాన్‌లను డిజైన్ చేసినట్లు శ్రీకాంత్ పేర్కొన్నారు. ఇవి సౌరశక్తితో పనిచేస్తాయని.. వాటికి సూర్యరశ్మి అవసరం అవుతుందని చెప్పారు. సూర్యుడు అస్తమించినప్పుడు చంద్రునిపై ఉష్ణోగ్రత -203 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోతుందని.. ఈ ఉష్ణోగ్రతలో విక్రమ్, ప్రజ్ఞాన్ పని చేయలేవన్నారు. ఏదేమైనా.. చంద్రునిపై 14 రాత్రులు గడిచాక ఆ రెండు తిరిగి పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బలంగా చెప్పారు. ఎందుకంటే.. చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టడానికి ముందు తాము కొన్ని పరీక్షలు నిర్వహించామని.. ఆ పరీక్షల్లో ల్యాండర్, రోవర్ తిరిగి ప్రాణం పోసుకున్నాయని ఆయన వెల్లడించారు.

Updated Date - 2023-08-29T18:28:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising