ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: చంద్రునిపై కనుగొన్న మూలకాల ప్రాముఖ్యత ఏంటి? ఇస్రో శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు?

ABN, First Publish Date - 2023-09-01T18:49:55+05:30

దక్షిణ ధ్రువంపై నిర్వహించిన పరీక్షల్లో భాగంగా.. చంద్రునిపై సల్ఫర్ ఉందన్న విషయాన్ని చంద్రయాన్-3 మిషన్ ధృవీకరించిన విషయం తెలిసిందే. తొలుత మంగళవారం నాడు...

దక్షిణ ధ్రువంపై నిర్వహించిన పరీక్షల్లో భాగంగా.. చంద్రునిపై సల్ఫర్ ఉందన్న విషయాన్ని చంద్రయాన్-3 మిషన్ ధృవీకరించిన విషయం తెలిసిందే. తొలుత మంగళవారం నాడు లేజర్-ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) అనే పరికరం దక్షిణ ధ్రువంపై సల్ఫర్ ఉందని గుర్తించగా.. అది నిజమేనని ప్రజ్ఞాన్ రోవర్‌లోని ఆల్ఫా పార్టికల్ ఎక్స్‌-రే స్పెక్ట్రోస్కోప్ (APXS) నిర్ధారించింది. ఒక్క సల్ఫర్ మాత్రమే కాదు.. కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీసు, సిలికాన్‌, ఆక్సిజన్ ఆనవాళ్లను కూడా LIBS గుర్తించినట్లు ఇస్రో వెల్లడించింది.


ఇప్పుడు తాజాగా ఈ మూలకాల ప్రాముఖ్యత గురించి ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా.. సల్ఫర్ మూలకం చంద్రుని మూలాలతో పాటు లోతైన అంతరిక్ష పరిశోధనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. చంద్రునిపై కనుగొన్న మూలకాలు కేవలం వివిక్త సమ్మేళనాలు కావని.. అవి విశ్వచరిత్రకు సంబంధించిన అన్వేషణలకు సహాయపడతాయని అన్నారు. ఈ మూలకాలతో చంద్రుని నిర్మాణం గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సల్ఫర్ మూలకం నీటి మంచులో చిక్కుకుపోయి ఉండొచ్చని.. ఇది చంద్రునిపై వాటర్ ఐస్ ఉందన్న చారిత్రాత్మక ఆవిష్కరణను సూచిస్తుందని పేర్కొన్నారు. చంద్రునిపై సల్ఫర్ ఆనవాళ్లు ఉండటాన్ని బట్టి చూస్తుంటే.. ఇక్కడ అగ్నిపర్వతాలు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

చంద్రునిపై ఒకానొక సమయంలో అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించి ఉండొచ్చని ఈ సల్ఫర్ సూచిస్తోందని అంటున్నారు. అయితే.. ఇందుకు మరింత డేటా అవసరం అవుతుందని ఇస్రో సైంటిస్టులు చెప్తున్నారు. సల్ఫర్ ఆవిష్కరణ.. చంద్రుని భూగర్భ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం తమ దృష్టి ఏదైనా రూపంలో నీళ్లు, అలాగే హైడ్రోజన్ మూలకం చంద్రునిపై ఉన్నాయా? లేవా? అనే కనుగొనడం మీదే ఉందని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. తాము చంద్రునిపై మనుగడ సాధ్యమవుతుందా? లేదా? అనే దానిపైనే ఫోకస్ పెట్టామని.. ధనవంతులు అవ్వాలన్నది తమ లక్ష్యం కాదని సైంటిస్టులు తేల్చి చెప్పారు.

Updated Date - 2023-09-01T18:49:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising