ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Uniform Civil Code : ఉమ్మడి పౌర స్మృతిపై వీథి పోరాటాలు ఉండవు : జామియా చీఫ్

ABN, First Publish Date - 2023-06-18T15:52:47+05:30

ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code)ను తాము వ్యతిరేకిస్తున్నామని, అయితే తాము రోడ్లపైకి ఎక్కి నిరసన కార్యక్రమాలను చేపట్టబోమని జామియా చీఫ్ అర్షద్ మదానీ (Arshad Madani) ఆదివారం చెప్పారు. తమకు 1,300 సంవత్సరాల నుంచి వ్యక్తిగత చట్టాలు ఉన్నాయని, ఇప్పటికీ తాము వాటికే కట్టుబడి ఉంటామని చెప్పారు.

Arshad Madani , Jamiat Chief
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code)ను తాము వ్యతిరేకిస్తున్నామని, అయితే తాము రోడ్లపైకి ఎక్కి నిరసన కార్యక్రమాలను చేపట్టబోమని జామియా చీఫ్ అర్షద్ మదానీ (Arshad Madani) ఆదివారం చెప్పారు. తమకు 1,300 సంవత్సరాల నుంచి వ్యక్తిగత చట్టాలు ఉన్నాయని, ఇప్పటికీ తాము వాటికే కట్టుబడి ఉంటామని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఉమ్మడి పౌర స్మృతిని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మదానీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉమ్మడి పౌర స్మృతిపై అభిప్రాయాలు తెలియజేయాలని శాసన పరిశీలక సంఘం (Law Commission) ఇటీవలే ప్రజలను, మత సంస్థలను కోరింది. అభిప్రాయాలను తెలియజేయడానికి 30 రోజుల గడువు ఇచ్చింది. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఉమ్మడి పౌర స్మృతిని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చాలా మంది భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అర్షద్ మదానీ ఆదివారం మాట్లాడుతూ, 1,300 ఏళ్ల నుంచి తమకు వ్యక్తిగత చట్టాలు ఉన్నాయని, ఇప్పటికీ తాము వాటికే కట్టుబడి ఉంటామని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వమూ ఇలా చేయలేదన్నారు. దీని అవసరం లేదన్నారు. నిరసనలు ఎంత ఎక్కువగా జరిగితే, హిందూ, ముస్లింలు అంత ఎక్కువ దూరమవుతారని, ఫలితంగా దుర్బుద్ధిగలవారి లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు.

ఇత్తెహాద్-ఏ-మిల్లత్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మౌలానా తౌకీర్ రజా ఖాన్ మాట్లాడుతూ, యూసీసీని అమలు చేయడమనేది బీజేపీకి ఎన్నికల గెలుపు సాధనమని వ్యాఖ్యానించారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ స్పందిస్తూ, యూసీసీ అనవసరమని, ఆచరణసాధ్యంకానిదని, దేశానికి తీవ్ర హానికరమని తెలిపింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పందిస్తూ, 2018లో ఈ అంశంపై సంప్రదింపుల నివేదికను అప్పటి లా కమిషన్ ప్రచురించిందని, తాజాగా మళ్లీ సంప్రదింపులు ఎందుకో ప్రస్తుత లా కమిషన్ చెప్పడం లేదని అన్నారు.

ఇవి కూడా చదవండి

Rs.500 Notes : రూ.500 నోట్లు అదృశ్యం వార్తలపై ఆర్బీఐ స్పందన

Extreme heatwave : ఉత్తరాదిలో విపరీతమైన వడగాడ్పులు.. యూపీ, బిహార్ రాష్ట్రాల్లో 98 మంది మృతి..

Updated Date - 2023-06-18T15:52:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising