ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kedarnath yatra : కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియ.. శిథిలాల్లో 10 మంది చిక్కుకున్నట్లు ఆందోళన..

ABN, First Publish Date - 2023-08-04T09:55:24+05:30

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో కొండచరియ విరిగిపడటంతో పెను ప్రమాదం సంభవించింది. రుద్ర ప్రయాగ్ జిల్లా, గౌరీ కుండ్ సమీపంలో ఈ కొండచరియ క్రింద దాదాపు 10 మంది చిక్కుకున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మార్గంలోని దుకాణాలు ధ్వంసమయ్యాయి. రాష్ట్ర విపత్తు స్పందన దళం హుటాహుటిన చేరుకుని, సహాయ కార్యక్రమాలను ప్రారంభించింది.

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో కొండచరియ విరిగిపడటంతో పెను ప్రమాదం సంభవించింది. రుద్ర ప్రయాగ్ జిల్లా, గౌరీ కుండ్ సమీపంలో ఈ కొండచరియ క్రింద దాదాపు 10 మంది చిక్కుకున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మార్గంలోని దుకాణాలు ధ్వంసమయ్యాయి. రాష్ట్ర విపత్తు స్పందన దళం హుటాహుటిన చేరుకుని, సహాయ కార్యక్రమాలను ప్రారంభించింది.

రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఈ కొండచరియ క్రింద సుమారు 10 నుంచి 12 మంది వరకు చిక్కుకున్నట్లు భావిస్తున్నామన్నారు. వీరిలో కొందరు కొట్టుకుపోయి ఉండవచ్చునని కూడా తెలిపారు. గురువారం రాత్రి భారీ వర్షాలు కురియడంతో ఈ కొండచరియ విరిగిపడిందని తెలిపారు. మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయన్నారు.

తప్పిపోయినవారిని గుర్తించేందుకు గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయని జిల్లా ఎస్‌పీ డాక్టర్ విశాఖ తెలిపారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ దలీప్ సింగ్ రాజ్వర్ మాట్లాడుతూ, భారీ వర్షాలు, రాళ్లు విరిగిపడటం వల్ల మూడు దుకాణాలు ధ్వంసమైనట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. వెంటనే గాలింపు చర్యలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ దుకాణాల వద్ద దాదాపు 12 మంది ఉన్నట్లు సమాచారం వచ్చిందని, వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

కేదార్‌నాథ్ వెళ్లే భక్తులు పార్వతీ దేవికి సంబంధించిన పుణ్య తీర్థం గౌరీకుండ్ వద్ద బస చేస్తూ ఉంటారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది.


ఇవి కూడా చదవండి :

Gyanvapi : జ్ఞానవాపిలో ఏఎస్ఐ సర్వే ప్రారంభం.. బహిష్కరించిన ముస్లిం పక్షం..

Chief Minister: ఆ కాల్వలను త్వరగా పూర్తి చేయండి

Updated Date - 2023-08-04T09:55:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising