ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Meenakshi Lekhi: ‘హమాస్’ వివాదంపై కేంద్రమంత్రి క్లారిటీ.. విచారణ జరిపి బాధ్యుల్ని పట్టుకోవాలని డిమాండ్

ABN, First Publish Date - 2023-12-09T18:19:56+05:30

అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రదాడులకు పాల్పడిన నేపథ్యంలో.. మిత్రపక్షమైన భారత్‌ని ఆ సంస్థను ఉగ్రసంస్థగా ప్రకటించాలని గతంలో ఇజ్రాయెల్ రాయబారి భారతదేశాన్ని అభ్యర్థించింది. అయితే.. ఈ అంశంపై భారత్ ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Meenakshi Lekhi On Hamas Issue: అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రదాడులకు పాల్పడిన నేపథ్యంలో.. మిత్రపక్షమైన భారత్‌ని ఆ సంస్థను ఉగ్రసంస్థగా ప్రకటించాలని గతంలో ఇజ్రాయెల్ రాయబారి భారతదేశాన్ని అభ్యర్థించింది. అయితే.. ఈ అంశంపై భారత్ ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంతలో.. హమాస్‌ని ఉగ్రసంస్థగా ప్రకటించే యోచనలో భారత్ ఉందా? అనే ప్రశ్నతో కూడిన దస్త్రాలపై కేంద్రమంత్రి మీనాక్షి లేఖి సంతకం చేసినట్లు ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. కొన్ని దస్త్రాలు కూడా వైరల్ అయ్యాయి. అయితే.. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా మీనాక్షి స్పష్టం చేశారు. ఇది తప్పుడు సమాచారం అని, తాను ఏ పేపర్‌పై కూడా సంతకం చేయలేదని క్లారిటీ ఇచ్చారు.


‘‘మీ ముందు తప్పుడు సమాచారం ఉంది. నేను ఏ దస్త్రాలపై కూడా సంతకం చేయలేదు. విచారణ ద్వారా అసలు నేరస్తుల బయటపడతారు’’ అంటూ ఎక్స్ వేదికగా మీనాక్షి లేఖి స్పందించారు. ఈ నేపథ్యంలో హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా? అని కాంగ్రెస్ ఎంపీ కుంభకుడి సుధాకరన్ ప్రశ్నించారు. అందుకు ఆమె బదులిస్తూ.. ఒక సంస్థను ఉగ్రవాదిగా ప్రకటించడం చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం పరిధిలోకి వస్తుందని బదులిచ్చారు. అలాగే.. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలోనూ తాను ఎలాంటి పత్రంపై సంతకం చేయలేదని ఆమె మరోసారి స్పష్టతనిచ్చారు. ఈ విషయాన్ని తాను PMO, S జైశంకర్‌ దృష్టికి తీసుకెళ్లానని.. విదేశాంగ కార్యదర్శికి ఫోన్ చేసి దీనిపై విచారణ జరిపించాలని కోరానని.. ఇందుకు పాల్పడిన వారిపై వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశానని అన్నారు.

మరోవైపు.. మంత్రి మీనాక్షి ఇచ్చిన ఈ స్పష్టతపై శివసేన(యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది కొంచెం ఘాటుగా స్పందించారు. ‘‘తాను ఎలాంటి దస్త్రాలపై సంతకం చేయలేదని మీనాక్షి చెప్తున్నారు. మరి.. ఇది ఫోర్జరీ జరిగి ఉంటుందని ఆమె అనుకుంటున్నారా? ఒకవేళ అదే నిజమైతే మాత్రం.. ఇది తీవ్రస్థాయి నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. దీనిపై ఆమె నుంచి మరింత స్పష్టత వస్తే మేం సంతోషిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. అటు.. ‘‘మీరు కాకపోతే మీ కోసం ఎవరు లాగిన్ అయ్యారు?’’ మీనాక్షి పోస్టుపై కాంగ్రెస్ నాయకుడు అమితాబ్ దూబే ప్రశ్నించారు. చూస్తుంటే.. ఈ వ్యవహారం మహువా మోయిత్రా తరహాలోనే పెద్ద వివాదాస్పదంగా మారేలా కనిపిస్తోంది.

Updated Date - 2023-12-09T18:19:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising