ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హత్యచేసి..రెండేళ్లపాటు బతికే ఉందని నమ్మించాడు!

ABN, First Publish Date - 2023-10-03T02:01:02+05:30

ఢిల్లీ పోలీసు శాఖలో ఉద్యోగంచేసే 27ఏళ్ల యువ తి దారుణహత్య రెండేళ్ల తర్వాత వెలుగుచూసింది!

పెళ్లికి తిరస్కరించిందని యువతిని చంపిన పోలీస్‌

న్యూఢిల్లీ, అక్టోబరు2: ఢిల్లీ పోలీసు శాఖలో ఉద్యోగంచేసే 27ఏళ్ల యువ తి దారుణహత్య రెండేళ్ల తర్వాత వెలుగుచూసింది! ఆమెను చంపిన ఓ హెడ్‌ కానిస్టేబుల్‌, హతురాలి కుటుంబసభ్యులను ఇన్నాళ్లూ ఆమె బతికే ఉందంటూ మధ్య పెట్టడంతో ఘోరం వెలుగుచూడలేదు. హతురాలు మోనా యాదవ్‌! ఇంట్లోని ముగ్గురు సోదరీమణుల్లో ఆమే చిన్న. యూపీకి చెందిన ఆమె 2014లో ఢిల్లీ పోలీసు శాఖలో ఉద్యోగం చేసింది. అక్కడ పనిచేసే సురేంద్ర రాణా (42) అనే హెడ్‌ కానిస్టేబుల్‌తో ఆమెకు పరిచయమైంది. అతడికి అప్పటికే పెళ్లైంది. అప్పుడప్పుడూ యూపీ బులందర్‌షహర్‌లోని ఆమె ఇంటికి వెళ్లేవాడు. 2021లో పెళ్లి చేసుకోవాలనుందంటూ మోనాకు ప్రతిపాదించాడు. ఆమె తిరస్కరించేసరికి ఓ కాలువలోకి తోసి చంపేశాడు. చెల్లి కనిపించకపోవడంతో ఆమె అక్క సురేంద్రను అడగ్గా తనకూ కనిపించడంలేదని చెప్పాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచార ణలో మోనాను హత్య చేసిన సంగతి తెలిసిపోతుందని సురేంద్ర తన బావమరిది రాబిన్‌ను రంగంలోకి దింపాడు. అతడిని మోనా పెళ్లి చేసుకుందని కుటుంబసభ్యులకు చెప్పాడు. రాబిన్‌తో ఆమె కుటుంబసభ్యులకు ఫోన్‌ చేయించేవాడు. తమతో మోనా మాట్లాడకపోవడంతో కుటుంబసభ్యులు అనుమానించారు. మోనా సోదరి ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ను కలిసి జరిగిందంతా చెప్పింది. ఆయన ఈ కేసు తేల్చాలం టూ ఢిల్లీ క్రైంబ్రాంచ్‌కు అప్పగించారు. సురేంద్రే మోనాను హత్యచేసినట్లు తేలింది.

Updated Date - 2023-10-03T02:01:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising