Israel Palestine Conflict: గాజా తరహాలో బిహార్‌లో రాకెట్లు పేల్చేస్తాం.. వివాదాస్పదమైన ఖాన్ సార్ వీడియోకి బెదిరింపులు
ABN, First Publish Date - 2023-10-23T15:59:48+05:30
ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంపై ప్రపంచ నలమూలల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏయే దేశం ఎవరివైపు ఉందన్న విషయంపై కూడా ఇప్పటికే..
ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంపై ప్రపంచ నలమూలల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏయే దేశం ఎవరివైపు ఉందన్న విషయంపై కూడా ఇప్పటికే ఒక నిర్ధారణ వచ్చేసింది. ఈ యుద్ధంపై కొందరు విశ్లేషకులు సైతం తమతమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ కోచింగ్ టీచర్ ఖాన్ సార్ కూడా ఈ యుద్ధంపై స్పందించాడు. అతడు ఇందులో ఎవరికీ మద్దతు తెలపలేదు కానీ, యుద్ధం వెనుక గల పూర్తి వివాదాన్ని వివరించాడు. అయితే.. ఖాన్ సార్ ఎవరికి మద్దతు ఇచ్చాడు? అనే అంశంపై ప్రజలు రెండు వర్గాలు చీలిపోయారు.
ఖాన్ సార్ మాటల్ని బట్టి చూస్తుంటే ఆయన పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నాడని ఒక వర్గం వారు చెప్తుంటే.. కాదు కాదు ఇజ్రాయెల్‌కి మద్దతు తెలిపాడంటూ మరో వర్గం వారు వాదిస్తున్నారు. ఈ వాదనల నడుమ ఒక యూజర్ ఏకంగా బెదిరింపులకే పాల్పడ్డాడు. మీ పరిస్థితిని గాజాలాగా చేస్తామంటూ అతడు వార్నింగ్ ఇచ్చాడు. ‘‘ఖాన్ సార్, నేను నేపాల్‌కి చెందినవాడ్ని. మాకు కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా కావాలి. అవి ఇవ్వకపోతే.. గాజాలాగే మీ బిహార్‌లోనూ రాకెట్లు పేల్చేస్తాం’’ అంటూ ఆ యూజర్ కామెంట్ చేశాడు. దీంతో.. ఈ కామెంట్ వివాదాస్పదమైంది. అతని గురించి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
ఖాన్ సార్ ఎవరు?
అతను పాట్నాకు చెందిన ఒక కోచింగ్ టీచర్. సోషల్ మీడియాలో విద్యార్థులకు బోధిస్తాడు. ప్రేరణాత్మక వీడియోలతో పాటు సామాజిక విషయాలపై తనదైన అభిప్రాయాల్ని వీడియోల ద్వారా తెలుపుతుంటాడు. తన వీడియోల ద్వారా జ్ఞానం కల్పించడంతో పాటు పంచ్‌లతో నవ్వులు పూయిస్తాడు. అందుకే.. ఖాన్ సార్ ఎంతో పాపులారిటీ గడించాడు. కొన్ని కార్యక్రమాలకు కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఖాన్ సార్ వీడియోలపై బ్రేకింగ్ న్యూస్‌లు కూడా వస్తున్నాయంటే, అతని రేంజ్ ఏంటో మీరే అర్థం చేసుకోండి.
అయితే.. ఖాన్ సార్ అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ఒకసారి సురేష్, అబ్దుల్ అనే ఊహాజనిత పేర్లతో ఒక కథ చెప్పిన అతను.. అందులో ముస్లిములంటే ఉగ్రవాదులన్న కోణంలో తన వివరణ ఇచ్చాడు. అప్పట్లో ఈ వీడియో పెను దుమారానికే దారి తీసింది. ఖాన్ సార్‌ని అరెస్ట్ చేయాలన్న కూడా వచ్చాయి. గతంలో కశ్మీర్ విషయంలో చైనా టిబెట్ విధానాన్ని అవలంభించాలని అతను ఖాన్ సర్ భారత్‌కు సలహా ఇచ్చినట్లు ఆరోపణలూ ఉన్నాయి.
Updated Date - 2023-10-23T15:59:53+05:30 IST