ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Netflix : భారతీయులకు షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్

ABN, First Publish Date - 2023-07-20T15:52:24+05:30

నెట్‌ఫిక్స్ (Netflix) సబ్‌స్క్రైబర్లకు ఇది చేదు వార్త. పాస్‌వర్డ్ షేరింగ్‌ సదుపాయాన్ని భారత దేశంలో రద్దు చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ గురువారం ప్రకటించింది. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారు తమ అకౌంట్‌ను తమ కుటుంబం కోసం మాత్రమే వినియోగించుకునే విధంగా నియంత్రించినట్లు తెలిపింది.

న్యూఢిల్లీ : నెట్‌ఫిక్స్ (Netflix) సబ్‌స్క్రైబర్లకు ఇది చేదు వార్త. పాస్‌వర్డ్ షేరింగ్‌ ఆప్షన్‌ను ఇండియాలో రద్దు చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ గురువారం ప్రకటించింది. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారు అకౌంట్‌ను తమ కుటుంబం కోసం మాత్రమే వినియోగించుకునే విధంగా నియంత్రణ చేస్తున్నట్టు తెలిపింది. తమ కుటుంబ సభ్యులు కానివారికి పాస్‌వర్డ్‌ను షేర్ చేయడాన్ని నిరోధించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారు తమ కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చునని ఈ స్ట్రీమింగ్ దిగ్గజం గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వ్యక్తి కుటుంబానికి చెందినవారు ఇల్లు, ప్రయాణం, ఇతర ప్రాంతాల సందర్శనలో ఉన్నపుడు నెట్‌ఫ్లిక్స్‌ను వాడుకోవచ్చునని తెలిపింది. ట్రాన్స్‌ఫర్ ప్రొఫైల్, మేనేజ్ యాక్సెస్ అండ్ డివైసెస్ వంటి కొత్త ఫీచర్లను కూడా ఉపయోగించుకోవచ్చునని తెలిపింది.

ఇండియాలోని నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్లు తమ కుటుంబ సభ్యులు కానివారికి పాస్‌వర్డ్ షేరింగ్ చేస్తున్నారని, అటువంటివారికి ఈ-మెయిల్స్ పంపిస్తున్నామని తెలిపింది. తమ సభ్యులకు అనేక ఎంటర్‌టైన్‌మెంట్ ఛాయిస్‌లు ఉన్నట్లు గుర్తించామని, అందుకే కొత్త కొత్త ఫిలింస్, టీవీ షోల కోసం భారీగా పెట్టుబడులను కొనసాగించాలని నిర్ణయించామని తెలిపింది. సబ్‌స్క్రైబర్లు తమ ఆసక్తి, కోరిక, భాషల ఆధారంగా తమకు నచ్చిన వినోద కార్యక్రమాలను ఎంపిక చేసుకుని, ఆస్వాదించవచ్చునని తెలిపింది. నెట్‌ఫ్లిక్స్‌లో సంతృప్తి కలిగించే అంశాలు నిరంతరం ఉంటాయని పేర్కొంది.

పాస్‌వర్డ్ షేరింగ్‌ను రద్దు చేసే ప్రక్రియను నెట్‌ఫ్లిక్స్ మే నెల నుంచి ప్రారంభించింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, బ్రెజిల్ సహా సుమారు 100 దేశాల్లో ఈ విధానాన్ని రద్దు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా దాదాపు 60 లక్షల మంది సబ్‌స్క్రైబర్లుగా చేరారు. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో 238 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు, 1.5 బిలియన్ డాలర్లు లాభాలు వచ్చినట్లు ఈ సంస్థ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి :

Manipur : మణిపూర్‌లో అంతర్యుద్ధం.. భారత్‌ను బీజేపీ ఏ స్థాయికి దిగజార్చింది?.. టీఎంసీ

Manipur : మణిపూర్‌ మహిళల నగ్న ఊరేగింపు.. చకచకా జరుగుతున్న కీలక పరిణామాలు..

Updated Date - 2023-07-20T16:13:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising