ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Donald Trump : బైడెన్‌ హయాంలో అణుయుద్ధం

ABN, First Publish Date - 2023-04-06T01:26:40+05:30

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హయాంలో మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని, అణు యుద్ధం కారణంగా మానవాళికి ముప్పు వాటిల్లుతుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జోస్యం చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది

నేను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్‌పై రష్యా దాడి జరిగేది కాదు

చైనా-రష్యా, ఇరాన్‌-సౌదీ కలిసేవి కాదు

బైడెన్‌ ఐదో ఫెయిల్యూర్‌ అధ్యక్షుడు

హష్‌మనీ కేసులో అరెస్టు, విడుదల

తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలు

కాలిఫోర్నియా కోర్టులో పోర్న్‌ స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌కు చుక్కెదురు

ట్రంప్‌కు రూ. కోటి చెల్లించాలన్న కోర్టు

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 5: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హయాంలో మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని, అణు యుద్ధం కారణంగా మానవాళికి ముప్పు వాటిల్లుతుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జోస్యం చెప్పారు. అమెరికా చరిత్రలోనే బైడెన్‌ ఐదో అతిపెద్ద విఫల అధ్యక్షుడని విమర్శించారు. ‘‘బైడెన్‌ హయాంలో అమెరికా పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది. ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆర్థిక వ్యవస్థ నేలచూపులు చూస్తోంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో లేకుండా పోయింది’’ అని ట్రంప్‌ అన్నారు. పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌తో సంబంధాల విషయాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు ఆమెకు 1.3 లక్షల డాలర్లు ఇచ్చిన హష్‌మనీ కేసులో మంగళవారం మన్‌హటన్‌ కోర్టులో ట్రంప్‌ అరెస్టైన విషయం తెలిసిందే. ఆ తర్వాత విడుదలైన ట్రంప్‌ ఫ్లోరిడాలోని తన రిసార్ట్‌కు చేరుకుని అక్కడ విలేకరుల సమావేశంలో బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నడూ ఇతర దేశాలు అణ్వాయుధాలు, అణుయుద్ధాల గురించి మాట్లాడుకోలేదు. ఇప్పుడు బైడెన్‌ విఫలపాలన వల్ల పరిస్థితి దిగజారింది. బైడెన్‌ హయాంలో అణుయుద్ధం జరగనుంది. రష్యా, చైనా ఒక్కటయ్యాయి. సౌదీ, ఇరాన్‌ ఒక్కటయ్యాయి. నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. ఇవి ఒక్కటయ్యేవి కాదు. అసలు ఉక్రెయిన్‌పై రష్యా దాడి జరగనిచ్చేవాడిని కాదు. చైనా, రష్యా, ఇరాన్‌, ఉత్తరకొరియాలు ఇప్పుడు ప్రపంచం పాలిట ముప్పుగా పరిణమించాయి’’అని ఆయన వ్యాఖ్యానించారు.

బైడెన్‌ హయాంలో అమెరికా డాలర్‌ దిగజారిపోతోందన్నారు. ‘‘ప్రపంచ కరెన్సీగా అమెరికా డాలర్‌ ప్రభను కోల్పోతోంది. గత 200ఏళ్లలో ఇది అమెరికాకు పెద్ద ఓటమిలాంటిది’’ అని ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా..హ్‌షమనీ కేసులో ట్రంప్‌ను శిక్ష నుంచి కాపాడటం ఎవరితరం కాదని భారతీయ-అమెరికన్‌ అటార్నీ రవి బట్రా అభిప్రాయపడ్డారు. ఆయన తదుపరి విచారణ డిసెంబరు 4న ఉందని..సరిగ్గా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 2నెలల ముందు జరిగే విచారణలో ఏమైనా జరగవచ్చన్నారు. ఇక కాలిఫోర్నియా కోర్టులో స్టార్మీ డేనియల్స్‌కు చుక్కెదురైంది. ట్రంప్‌కు రూ.కోటి(1.2 లక్షల డాలర్లు) చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఆమె డబ్బు కోసమే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ట్రంప్‌ గతం లో ఆరోపించారు. దీనిపై డేనియల్స్‌ 2018లో పరువునష్టం దావావేసి ఓడిపోయారు. ట్రంప్‌ న్యాయవాదులకు రూ.2.93 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలని స్థానిక కోర్టు ఆమెను ఆదేశించింది. ఆమె పైకోర్టులో అప్పీల్‌ చేసుకున్నా అక్కడా మరో 2.45లక్షల డాలర్ల ఫైన్‌ పడింది.కాలిఫోర్నియా కోర్టులో అప్పీల్‌చేయగా కోర్టు ఆమెకు 1.2లక్షల డాలర్ల ఫైన్‌ వేసింది.

Updated Date - 2023-04-06T03:55:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising