ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israel-Hamas War: ఆ రాకెట్లు, సైరన్‌ల శబ్దాలు ఇంకా చెవుల్లో మార్మోగుతున్నాయి.. ఇజ్రాయెల్ హారర్‌పై భారతీయులు

ABN, First Publish Date - 2023-10-13T18:11:18+05:30

గాజాలోని హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు), ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ ఆజయ్’ను...

గాజాలోని హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు), ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ ఆజయ్’ను ప్రారంభించింది. ఆ ఆపరేషన్‌లో భాగంగా.. టెల్ అవీవ్ అనే ప్రత్యేక విమానం శుక్రవారం 212 భారతీయుల్ని భారత్‌కు తీసుకొచ్చింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో వీళ్లు దిగారు. ఇజ్రాయెల్‌లో ఉన్నంతవరకూ అరచేతుల్లో ప్రాణాలు పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపిన వీళ్లంతా.. ఇప్పుడు సురక్షితంగా భారత్‌కు చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా.. ఇజ్రాయెల్‌లో తాము ఎదుర్కొన్న భయానక అనుభవం గురించి వాళ్లు పంచుకున్నారు.


శశ్వంత్ సింగ్ అనే ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘‘నేను 2019 నుండి నా భార్యతో కలిసి సెంట్రల్ ఇజ్రాయెల్‌లో ఉంటున్నాను. ఆరోజు (హమాస్ 5వేల రాకెట్లతో మెరుపుదాడి చేసిన రోజు) వైమానిక దాడి గురించి తెలియజేసే సైరన్ల మోతతో మేము నిద్రలేచాం. అసలేం జరుగుతోందని తెలిసేలోపే.. రాకెట్ల వర్షం కురిసింది. అప్పుడు ఇజ్రాయెల్ అధికారులు మమ్మల్ని దగ్గరలోని షెల్టర్లలోకి వెళ్లమని చెప్పారు. అక్కడ ఉన్నన్ని రోజులు ప్రాణాల్ని అరచేతుల్లో పట్టుకుని భయంభయంగా గడిపాం. ఆ భయానక పరిస్థితుల నుంచి బయటపడి, మేము బయలుదేరే వరకూ సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ఆ మోత ఇప్పటికీ మా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. అలాంటి నరకం నుంచి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం’’ అని అన్నారు.

ఇదే సమయంలో ఇజ్రాయెల్‌లో పీహెచ్‌డీ చేస్తున్న పశ్చిమ బెంగాల్ నివాసి సుపర్ణో ఘోష్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ప్రతిచోటా ఆశ్రయాలను నిర్మించిందని, అందుకే తాము సురక్షితంగా బయటపడగలిగామని చెప్పారు. అనంతరం జైపూర్ నివాసి మినీ శర్మ మాట్లాడుతూ.. అవి చాలా భయానక రోజులని, సైరన్ మోగినప్పుడల్లా పరిస్థితి మరింత భయానకంగా మారిందంటూ చెప్పుకొచ్చారు. మరో విద్యార్థి దీపక్ మాట్లాడుతూ.. దేశానికి తిరిగి రావడం ఆనందంగా ఉందన్నారు. కాగా.. ఇజ్రాయెల్‌లో దాదాపు 18 వేల మంది భారతీయులు ఉన్నారు. అలాగే గాజాలో 12 మంది, వెస్ట్ బ్యాంక్‌లో నలుగురు ఇండియన్స్ నివసిస్తున్నారు. వీరిని ‘ఆపరేషన్‌ అజయ్‌’ కింద భారత్‌కు తీసుకొస్తున్నారు.

Updated Date - 2023-10-13T18:11:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising