Operation Kaveri: కొనసాగుతున్న ఆపరేషన్ కావేరీ, స్వదేశానికి మరో 186 మంది భారతీయులు
ABN, First Publish Date - 2023-05-01T15:33:54+05:30
సూడాన్ (Sudan)లో అంతర్యుద్ధం కారణంగా అక్కడి నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ‘ఆపరేషన్ కావేరి’ (Operation Kaveri) వేగంగా కొనసాగుతోంది.
సూడాన్ (Sudan)లో అంతర్యుద్ధం కారణంగా అక్కడి నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ‘ఆపరేషన్ కావేరి’ (Operation Kaveri) వేగంగా కొనసాగుతోంది. తాజాగా జెడ్డా నుంచి 186 మందితో వాయిసేన విమానం కేరళలోని కొచ్చికి చేరుకుంది. విడతల వారీగా సూడాన్ నుంచి జెడ్డాం మీదుగా స్వదేశానికి భారతీయులను తరలిస్తున్నారు. 186 మంది ప్రయాణికులతో కూడిన విమానం కొచ్చికి చేరుకుంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికార ప్రతినిధి సోమవారం ట్వీట్ చేశారు. ఇప్పటివరకు సూడాన్ నుంచి 2,700 మంది సురక్షితంగా భారత్ చేరుకున్నారు.
కాగా ‘‘ఆపరేషన్ కావేరిలో భాగంగా 229 మందితో కూడిన విమానం ఆదివారం బెంగళూరు (Bengaluru)కు చేరుకుంది. దాం తోపాటు 40 మందితో కూడిన భారత వాయుసేన విమానం సీ-130జే దిల్లీ (Delhi)కి చేరుకుంది. అంతేకాకుండా ఆపరేషన్ కావేరీలో భాగంగా మరో 135మంది భారతీయులు పోర్టు సూడాన్ నుంచి జెడ్డాకు బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు.
“గత కొన్ని రోజులుగా దాదాపు 1400 మంది భారతీయులను IAF విమానంలో తరలించినట్లు భారత వైమానిక దళం (IAF) సోమవారం ఇలా ట్వీట్ చేసింది. రెండు C-130J విమానాలు 90 ఏళ్లు పైబడిన వృద్ధులతో సహా 260 మంది సిబ్బందిని తరలించాయి.
Updated Date - 2023-05-01T15:33:54+05:30 IST