ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Parliament: మణిపూర్ ఉదంతంపై అట్టుడికిన పార్లమెంట్..

ABN, First Publish Date - 2023-07-24T12:22:40+05:30

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడటం గమనార్హం. మణిపూర్‌ అంశంపై చర్చకు విపక్షాల పట్టుబట్టాయి. మణిపూర్‌ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశాయి.

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడటం గమనార్హం. మణిపూర్‌ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. మణిపూర్‌ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశాయి. పార్లమెంటులో విపక్షాల నిరసన కారణంగా ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ ఆవరణలో కూడా అధికార, విపక్ష పార్టీల ప్లకార్డులతో పోటాపోటీగా ఆందోళనలు చేశారు. పార్లమెంట్ గాంధీ విగ్రహం ఎదుట బీజేపీ ఎంపీలు ఆందోళన చేశారు. బెంగాల్ హింస, రాజస్థాన్‌లో మహిళలపై నేరాలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. సభను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ నెల 20న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మణిపూర్‌ ఉదంతంపై ఉభయ సభలు అట్టుడికాయి. పూర్తిస్థాయి చర్చ జరగాల్సిందేనని, సభలో మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌, ఆర్జేడీ, ఎంఐఎం, వామపక్షాలు, బీఆర్‌ఎస్‌ తదితర ప్రతిపక్షాలు గళమెత్తాయి. ప్రధాని సమక్షంలోనే చర్చ జరగాలని డిమాండ్‌ చేశాయి.


మణిపూర్‌పై చర్చించాలని వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. సభ్యులు ఇచ్చిన నోటీసులపై స్వల్పకాలిక చర్చకు అటు లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌ అంగీకరించారు. అయితే రాజ్యసభ రూల్‌ 267 కింద సభా కార్యకలాపాలన్నీ నిలిపివేసి మణిపూర్‌పై చర్చ జరపాలని ఖర్గే పట్టుబట్టారు. దీనికి అనుమంతిచకపోవడంతో గురు, శుక్రవారాల్లో వాయిదాల పర్వం సాగింది. కాగా, 1990 తర్వాత రూల్‌ 267 కింద రాజ్యసభలో 11సార్లు చర్చించారు. చివరిగా..2016లో నోట్ల రద్దుపై దీర్ఘకాలిక చర్చ జరిగింది. విపక్షాల పట్టుదల నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పందించారు. ‘చేతులెత్తి కోరుతున్నా.. మణిపూర్‌పై జరిగే స్వల్పకాలిక చర్చలో పాల్గొనండి. అక్కడ మహిళలపై జరుగుతున్న దారుణాలను రాజకీయం చేయకండి’ అని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-07-24T12:25:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising