ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi: పార్లమెంటులో భద్రత ఉల్లంఘన సహించరానిది... రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలను కోరిన మోదీ

ABN, Publish Date - Dec 17 , 2023 | 09:51 AM

పార్లమెంటులో జరిగిన భద్రత ఉల్లంఘన తీవ్రమైన అంశమని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. ఈ ఘటనను అందరూ ఖండించాలని.. ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు.

ఢిల్లీ: పార్లమెంటు భద్రత ఉల్లంఘన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఈ ఘటన తీవ్రమైన అంశమని ప్రధాని మోదీ(PM Modi) ఖండించారు. ఈ ఘటనను అందరూ ఖండించాలని.. ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు.

ఆయన మాట్లాడుతూ.. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. అంతకుముందు, లోక్‌సభలో (Lokhsabha) భద్రతా లోపంపై సీరియస్‌గా వ్యవహరించాలని సీనియర్ మంత్రులను మోదీ ఆదేశించారు.ఈ అంశంపై సమష్టిగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.


పార్లమెంటులో అలజడికి (Parliament Security breach) సంబంధించి కీలక నిందితుడిగా భావిస్తున్న లలిత్ ఝాను (Lalit Jha) పాటియాలా హౌస్ కోర్టు శుక్రవారం ఏడు రోజుల పోలీస్ కస్టడీకి పంపింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ సెల్ ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతోంది. కోల్‌కతాకు చెందిన టీచర్ లలిత్ ఝా గురువారం సాయంత్రం పోలీసులకు లొంగిపోవడంతో వెంటనే అతన్ని అరెస్టు చేశారు. భద్రతా ఉల్లంఘనల ఘటనకు తెరవెనుక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝూ పోలీసు విచారణలో కీలక వివరాలు వెల్లడించినట్టు తెలుస్తోంది.

కాగా, ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు పట్టుబడగా, వారిలో నలుగురిని ఏడు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. 2001 పార్లమెంటుపై దాడి ఘటన 22వ వార్షికోత్సవం రోజైన డిసెంబర్ 13న ఇద్దరు ఆగంతకులు లోక్‌సభలో గలభా సృష్టించడం సంచలనమైంది. గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకిన ఆగంతకులు ఒక రకమైన గ్యాస్ వదులుతూ అలజడి రేపడంతో ఎంపీలు భయాందోళనలకు గురయ్యారు. అంతలోనే తేరుకుని ఆ ఇద్దర్నీ పట్టుకున్నారు. పార్లమెంటు వెలుపల ఆందోళనకు దిగిన మరో ఇద్దరు నిరసనకారులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - Dec 17 , 2023 | 10:54 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising