PM Modi: సర్దార్ పటేల్‌కు మోదీ ఘన నివాళి.. ఆయన సేవల్ని కొనియాడిన ప్రధాని
ABN, Publish Date - Dec 15 , 2023 | 11:01 AM
భారత తొలి హోం శాఖ మంత్రి, స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) వర్ధంతి సందర్భంగా ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi).
ఢిల్లీ : భారత తొలి హోం శాఖ మంత్రి, స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) వర్ధంతి సందర్భంగా ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi). ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. ఎక్స్(X)లో ఆయన మాట్లాడుతూ..
"మరిన్ని వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి"
"బలమైన, ఐక్య దేశాన్ని నిర్మించడంలో పటేల్ కీలక పాత్ర పోషించారు. బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యం వచ్చేలా కృషి చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలు రాచరికపాలనలో ఉన్నప్పుడు చాకచక్యతను ప్రదర్శించి భారత్ లో విలీనం చేశారు. ఆయన దార్శనిక నాయకత్వం, దేశ ఐక్యతపట్ల అచంచల నిబద్ధత ఆధునిక భారత్ నిర్మాణానికి పునాదులు వేసింది. ఆయన ఆదర్శవంతమైన జీవితం దేశ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తుంది. పటేల్ కలల్ని సాకారం చేసేందుకు కృషి చేస్తాం" అని అన్నారు.
Updated Date - Dec 15 , 2023 | 11:11 AM