Chandrayaan-3 : అంతా అనుకున్నట్లే.. ప్లాన్-బీ లేదు..
ABN, First Publish Date - 2023-08-23T17:17:54+05:30
మరికాసేపట్లో భారత దేశ సింహాలు చంద్రునిపై గర్జించబోతున్నాయి. చంద్రయాన్-3 కార్యక్రమం అంతా సజావుగానే జరుగుతోందని, గతంలో సూచించినట్లుగా ప్లాన్-బీ వైపు ఆలోచించవలసి అవసరం లేదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ : మరికాసేపట్లో భారత దేశ సింహాలు చంద్రునిపై గర్జించబోతున్నాయి. చంద్రయాన్-3 కార్యక్రమం అంతా సజావుగానే జరుగుతోందని, గతంలో సూచించినట్లుగా ప్లాన్-బీ వైపు ఆలోచించవలసి అవసరం లేదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) వర్గాలు తెలిపాయి. ల్యాండింగ్ ప్రక్రియ ముందుగా నిర్ణయించినట్లుగానే జరుగుతోందని తెలిపాయి. సానుకూల సంకేతాలు అందుతున్నాయని స్పష్టం చేశాయి.
ప్లాన్-బీ ప్రకారం బుధవారం పరిస్థితులు అనుకూలంగా లేకపోతే, విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగే ప్రక్రియను ఈ నెల 27కు వాయిదా వేయాలని భావించిన సంగతి తెలిసిందే.
ఈ అద్భుత సన్నివేశాలను కనులారా చూసి, తరించడానికి, శాస్త్రవేత్తలను అభినందించడానికి దేశవ్యాప్తంగా అందరూ సిద్ధంగా ఉన్నారు. కేంద్ర మంత్రులు, అధికారులు కూడా సర్వసన్నద్ధంగా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు.
బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగబోతోంది. దీనితోపాటు దిగే ప్రజ్ఞాన్ రోవర్ భారత దేశ జాతీయ చిహ్నాన్ని చంద్రునిపై ముద్రిస్తుంది. అశోకుని లయన్ కేపిటల్ నుంచి స్వీకరించిన ఈ చిహ్నంలో నాలుగు సింహాలు ఉంటాయి.
ప్రజ్ఞాన్ రోవర్ వెనుక చక్రాలు పరుగులు తీస్తూ ఈ జాతీయ చిహ్నాన్ని చంద్రునిపై ముద్రిస్తుంది. దీంతో భరతమాత కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరుతుంది.
జాతీయ చిహ్నంతోపాటు ఇస్రోను కూడా ఈ రోవర్ ముద్రిస్తుంది. దీంతో భారత దేశ ఔన్నత్యం చంద్రునిపై శాశ్వతంగా నిలిచిపోతుంది.
ఇవి కూడా చదవండి :
Chandrayaan-3 : చంద్రునిపై భారత్ జయకేతనం ఎగురవేయాలంటూ కోట్లాది మంది పూజలు
Chandrayaan-3 : గతంలో ఇస్రోను ఎగతాళి చేసిన పాకిస్థానీ నేత, ఇప్పుడు ఏమంటున్నారంటే..
Updated Date - 2023-08-23T17:17:54+05:30 IST