ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3 : చంద్రునిపై భారత్ జయకేతనం ఎగురవేయాలంటూ కోట్లాది మంది పూజలు

ABN, First Publish Date - 2023-08-23T12:42:44+05:30

భారత దేశ కీర్తి, ప్రతిష్ఠలకు; శక్తి, సామర్థ్యాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించే క్షణాలు అతి త్వరలో రాబోతున్నాయి. ఆ క్షణాల కోసం కోట్లాది మంది భారతీయులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ‘చందమామ’ అని ఆత్మీయంగా పిలుచుకునే జాబిల్లిపైన మువ్వన్నెల జెండాను సగర్వంగా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.

న్యూఢిల్లీ : భారత దేశ కీర్తి, ప్రతిష్ఠలకు; శక్తి, సామర్థ్యాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించే క్షణాలు అతి త్వరలో రాబోతున్నాయి. ఆ క్షణాల కోసం కోట్లాది మంది భారతీయులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ‘చందమామ’ అని ఆత్మీయంగా పిలుచుకునే జాబిల్లిపైన మువ్వన్నెల జెండాను సగర్వంగా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. మామ గారి ఇంట్లో అడుగు పెట్టి, ఆనందంతో చిందులు వేయాలని కలలు కంటున్నారు. మా కలలను సాకారం చేయాలని భగవంతుని వేడుకుంటున్నారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. నదుల వద్ద హారతులిస్తున్నారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తెలిపిన వివరాల ప్రకారం చంద్రయాన్-3 షెడ్యూలుకు అనుగుణంగానే దూసుకెళ్తోంది. దీనిలోని విక్రమ్ ల్యాండర్ సజావుగా చంద్రునిపైకి దిగాలని, భారతీయ శాస్త్రవేత్తల కృషికి సత్ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటూ కశ్మీరు నుంచి కన్యా కుమారి వరకు భారతీయులంతా పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. గంగా నది వద్ద గంగమ్మ తల్లికి హారతులు ఇస్తున్నారు. నెట్టింట్లో కూడా యూజర్లు ముక్తకంఠంతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆంజనేయుడు ఒక చేతితో జాతీయ జెండాను, మరో చేతితో చంద్రయాన్-3ని చంద్రునిపైకి తీసుకెళ్తున్నట్లు ఫొటోలు ట్వీట్ చేస్తున్నారు. మొత్తం మీద సర్వత్రా ఐక్యత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని హృషీకేశ్‌లో గంగమ్మతల్లికి హారతులిచ్చి చంద్రయాన్-3 విజయవంతం కావాలని ప్రార్థనలు చేశారు. జానపద గీతాలను అల్లుకుని కొందరు పాడుతూ, భారత దేశం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చంద్రయాన్-3 చంద్రునిపైకి దిగే కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో వీక్షిస్తారు. ఆయన ప్రస్తుతం బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

విద్యార్థినీ, విద్యార్థులు చందమామ రావే, జాబిల్లి రావే అని పాడుకుంటూ గడిపిన బాల్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు మామ గారి ఇంటికి వెళ్లాలని తహతహలాడుతున్నారు. చంద్రయాన్-3 వల్ల అందరిలోనూ సకారాత్మక (Positive) భావాలు వెల్లివిరుస్తున్నాయి.

చంద్రుని దక్షిణ ధ్రువంపైకి చంద్రయాన్-3 బుధవారం సాయంత్రం 6.04 గంటలకు సురక్షితంగా దిగుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి :

Chandrayaan-3: పాఠశాలల్లో చంద్రయాన్ 3ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు.. కానీ..

Joe Biden: భారత్‌లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఎప్పుడంటే..?

Updated Date - 2023-08-23T12:58:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising