17 నుంచి దేశవ్యాప్తంగా మోదీ జన్మదిన వేడుకలు
ABN, First Publish Date - 2023-08-31T02:30:26+05:30
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.
అక్టోబరు 2 వరకు నిర్వహిస్తాం: జేపీ నడ్డా
న్యూఢిల్లీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. దీనికి సంబంధించి బుధవారం తమ పార్టీ పార్లమెంటు సభ్యులకు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ సమావేశంలో మార్గనిర్దేశం చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, కె.లక్ష్మణ్, బండి సంజయ్, అర్వింద్, సోయం బాపూరావు, ఏపీ ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘‘ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 17 నుంచి అక్టోబర్ 2న గాంధీజయంతి వరకు ‘‘సేవాపఖ్వాడా’’ (పక్షం రోజులు)ను జరపాలి. ఈ పక్షం రోజుల్లో ఎంపీలందరూ మీనియోజకవర్గాల పరిధిలో రక్తదాన శిబిరాలు, స్వచ్ఛత, సేవా కార్యక్రమాలను చేపట్టాలి’’ అని నడ్డా ఎంపీలకు సూచించారు.
Updated Date - 2023-08-31T02:30:26+05:30 IST