ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శాసనకర్తలకు రాజ్యాంగ రక్షణ ఎంతవరకు?

ABN, First Publish Date - 2023-09-26T01:45:13+05:30

చట్టసభల్లో ఓటు వేసేందుకుగానీ, ప్రసంగం చేసేందుకుగానీ లంచం తీసుకుంటే అలాంటి సభ్యులను ప్రాసిక్యూట్‌ ...

పి.వి. కేసులో తీర్పుపై పునఃపరిశీలనకు ఏడుగురి ధర్మాసనం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: చట్టసభల్లో ఓటు వేసేందుకుగానీ, ప్రసంగం చేసేందుకుగానీ లంచం తీసుకుంటే అలాంటి సభ్యులను ప్రాసిక్యూట్‌ చేయకుండా రాజ్యాంగ పరంగా రక్షణ ఉందంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సోమవారం ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అధ్యక్షతన జస్టిస్‌ జస్టిస్‌ ఎ.ఎ్‌స.బోపన్న, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌, జస్టిస్‌ పి.ఎ్‌స.నరసింహ, జస్టిస్‌ జె.బి.పార్డీవాలా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలు సభ్యులుగా ఈ ధర్మాసనం ఏర్పాటయింది. అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా 1998లో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ రాజ్యాంగంలోని 105(2) అధికరణం, 194(2) అధికరణం ప్రకారం సభ్యులకు ఈ రక్షణ ఉందని తెలిపింది. 2012లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా సభ్యురాలు సీతా సొరేన్‌ లంచం తీసుకొని ఓటు వేశారన్న కేసులో ఈ తీర్పు ప్రస్తావనకు వచ్చింది. ఆమె లంచం తీసుకున్నారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే పి.వి.నరసింహారావు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 194(2) అధికరణం ప్రకారం తనకు రక్షణ ఉందని, తనను ప్రాసిక్యూట్‌ చేయలేరని ఆమె వాదించారు. ఆ వాదనతో ఝార్ఖండ్‌ హైకోర్టు ఏకీభవించలేదు. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా తొలుత అయిదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. పి.వి.నరసింహారావు కేసులో ఇచ్చిన తీర్పుపై మళ్లీ పరిశీలన జరిపేందుకు ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎలాంటి పర్యవసానాలకు భయపడకుండా సభలో సభ్యులు స్వేచ్ఛగా ప్రసంగాలు చేయడానికే ఈ రక్షణ కల్పించడానికే రక్షణలు కల్పించారే తప్ప క్రిమినల్‌ నేరాలు చేయడానికి కాదని కోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. తదుపరి విచారణను అక్టోబరు నాలుగో తేదీకి వాయిదా వేసింది.

Updated Date - 2023-09-26T01:45:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising