Akash Ambani: ఏఐలో జియో మార్క్.. భారత్ జీపీటీని అభివృద్ధి చేస్తున్న ఐఐటీ బాంబే
ABN, Publish Date - Dec 28 , 2023 | 04:21 PM
భారత్ జీపీటీ(Barath GPT) టెక్నాలజీ కోసం పని చేస్తున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ(Akash Ambani) ప్రకటించారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. ఐఐటీ బాంబే, రిలయన్స్ జియో పరస్పర సహకారంతో భారత్ జీపీటీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ఢిల్లీ: ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తోంది. ఎవ్వరూ ఊహించని సాంకేతికతలు ఒక్కొక్కటిగా పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు భౌతికంగా చేసుకోవాల్సిన పనుల్ని.. అందుబాటులో ఉన్న టెక్నాలజీతో సులభంగా చేసుకోగలుగుతున్నాం. ఈ నేపథ్యంలో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా కొత్త టెక్నాలజీలను పరిచయం చేస్తున్నారు నిపుణులు.
తాజాగా భారత్ జీపీటీ(Barath GPT) టెక్నాలజీ కోసం పని చేస్తున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ(Akash Ambani) ప్రకటించారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. ఐఐటీ బాంబే, రిలయన్స్ జియో పరస్పర సహకారంతో భారత్ జీపీటీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
రిలయన్స్ జియో, టెలికమ్యూనికేషన్స్ స్ట్రీమింగ్‌లో సక్సెస్ కావడంతో, ఇప్పుడు కృత్రిమ మేధస్సు(AI) రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బాంబే సహకారంతో Jio తన కొత్త AI ప్రాజెక్ట్ భారత్ GPTని ప్రారంభించనుంది. జియో, దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించిన తర్వాత, భారత్ GPTని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు ఆకాష్ అంబానీ ఇటీవల ప్రకటించారు. ఈ టెక్నాలజీని జియో టెలికాం ఉత్పత్తుల ప్రమోషన్ తదితర అవసరాల కోసం ఉపయోగించుకోనున్నారు.
Updated Date - Dec 28 , 2023 | 04:21 PM