ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు

ABN, First Publish Date - 2023-09-12T02:37:44+05:30

ప్రతిష్ఠాత్మక శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డుకు జీవ శాస్త్రవేత్త మద్దిక సుబ్బారెడ్డి ఎంపికయ్యారు. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎ్‌సఐఆర్‌) 2022 ఏడాదికి సంబంధించి ఈ అవార్డులను ప్రకటించింది...

న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: ప్రతిష్ఠాత్మక శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డుకు జీవ శాస్త్రవేత్త మద్దిక సుబ్బారెడ్డి ఎంపికయ్యారు. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎ్‌సఐఆర్‌) 2022 ఏడాదికి సంబంధించి ఈ అవార్డులను ప్రకటించింది. ఈనెల 26న సీఎ్‌సఐఆర్‌ వ్యవస్థాపక దినోత్సవం జరగనున్న నేపథ్యంలో.. సుబ్బారెడ్డి సహా 12 మంది శాస్త్రవేత్తలను ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు సోమవారం వెల్లడించింది. దీనికింద ప్రశంసాపత్రంతో పాటు రూ.5 లక్షల నగదును బహూకరిస్తారు. ఈసారి మెడికల్‌ సైన్సెస్‌ విభాగంలో దీప్యమాన్‌ గంగూలీకి, జీవశాస్త్ర విభాగంలో అశ్వని కుమార్‌, మద్దిక సుబ్బారెడ్డిలకు అవార్డు దక్కింది. వాతావరణ, గ్రహాల పరిశోధన విభాగంలో విమల్‌ మిశ్రా, రసాయన శాస్త్ర విభాగంలో అక్కట్టు టీ బిజు, దెబవ్రత మైతీ ఎంపికయ్యారు. ఇంజనీరింగ్‌ సైన్సెస్‌ విభాగంలో దీప్తి రంజన్‌ సాహూ, రజనిష్‌ కుమార్‌, గణిత శాస్త్రంలో అపూర్వ ఖరే, నీరజ్‌ కయల్‌ అవార్డు సాధించారు. భౌతిక శాస్త్రంలో బసుదేబ్‌, అనింద్య దాస్‌ను శాంతి స్వరూప్‌ అవార్డు వరించింది.

Updated Date - 2023-09-12T02:37:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising