ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Maternity Leave: మహిళలకు సిక్కిం సీఎం శుభవార్త.. ఇకపై 12 నెలల మెటర్నిటీ లీవ్

ABN, First Publish Date - 2023-07-27T17:48:44+05:30

సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమంగ్ మహిళలకు శుభవార్త తెలిపారు. ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న మహిళల కోసం 12 నెలల మెటర్నిటీ లీవ్ పీరియడ్‌ని...

సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమంగ్ మహిళలకు శుభవార్త తెలిపారు. ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న మహిళల కోసం 12 నెలల మెటర్నిటీ లీవ్ పీరియడ్‌ని త్వరలోనే తీసుకురానున్నట్టు ప్రకటించారు. గురువారం సిక్కిం రాష్ట్ర సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (SSCSOA) వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈమేరకు ప్రకటన చేశారు. అలాగే ఒక నెల పెటర్నిటీ లీవ్‌ని అమలు చేస్తామని వెల్లడించారు. ఇది ప్రభుత్వం ఉద్యోగులకు తమ పిల్లల బాగోగులు చూసుకోవడానికి, కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. త్వరలోనే ఈ సెలవులకు సంబంధించిన వివరాల్ని తెలియజేస్తామని సీఎం చెప్పుకొచ్చారు.

స్టేట్ అడ్మినిస్ట్రేషన్ & సిక్కిం అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రజలకు నిరంతరం సేవలు అందించడంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని.. వీళ్లు రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్నారని సీఎం తమంగ్ కొనియాడారు. సివిల్ సర్వీసెస్ అధికారుల పదోన్నతుల ప్రక్రియను క్రమబద్ధీకరించడంపై కూడా తాము దృష్టి సారించామని, దీనివల్ల పదోన్నతుల సంఖ్య పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. కొత్తగా నియమించబడిన ఐఏఎస్, ఎస్‌సీఎస్ (సిక్కిం సివిల్ సర్వీసెస్) అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. వీళ్లందరూ కెరీర్ పరంగా ఉన్నతస్థానాలకు చేరాలని ఆకాంక్షించారు.


ఇదిలావుండగా.. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం పని చేసే మహిళలకు 6 నెలలు లేదా 26 వారాల జీతంతో కూడిన మెటర్నిటీ లీవ్ ఉంటుంది. ఇప్పుడు సిక్కిం ప్రభుత్వం ఆ సెలవుల్ని మరో ఆరు నెలలు పెంచబోతోంది. దీనికితోడు.. ఒక నెల రోజుల పెటర్నిటీ లీవ్ బోనస్. ఇది నిజంగా సిక్కిం ప్రభుత్వ ఉద్యోగులకు (మహిళలకు) బంపరాఫరేనని చెప్పుకోవాలి.

Updated Date - 2023-07-27T17:48:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising