ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గూగుల్‌ ఇండియా పబ్లిక్‌ పాలసీ హెడ్‌గా శ్రీనివాస రెడ్డి

ABN, First Publish Date - 2023-10-05T02:14:19+05:30

గూగుల్‌ ఇండియా విభాగం పబ్లిక్‌ పాలసీ హెడ్‌గా శ్రీనివాస రెడ్డి నియామకమయ్యారు. సామ్‌సంగ్‌, యాపిల్‌, మైక్రోస్టాప్‌ వంటి దిగ్గజ కంపెనీల్లో ఆయన వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవముంది...

న్యూఢిల్లీ, అక్టోబరు 4: గూగుల్‌ ఇండియా విభాగం పబ్లిక్‌ పాలసీ హెడ్‌గా శ్రీనివాస రెడ్డి నియామకమయ్యారు. సామ్‌సంగ్‌, యాపిల్‌, మైక్రోస్టాప్‌ వంటి దిగ్గజ కంపెనీల్లో ఆయన వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవముంది. శ్రీనివాస రెడ్డి గూగుల్‌లో చేరబోతున్నట్లు ఈ ఏడాది జూలైలోనే వార్తలు గుప్పుమన్నాయి. దేశంలో న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కోవడంలో, హార్డ్‌వేర్‌ అసెంబ్లీని విస్తరించడంలో శ్రీనివా్‌సకు తగిన అనుభవముందని ఆ సంస్థ పేర్కొంది. అంతకుముందు గూగుల్‌ పబ్లిక్‌ పాలసీ హెడ్‌గా ఉన్న అర్చన గులాటి చేరిన 5 నెలలకే రాజీనామా చేశారు. అది ముగిసిన ఏడాది కాలం తర్వాత ఆండ్రాయిడ్‌, గూగుల్‌ ప్లే స్టోర్‌కు సంబంధించి కంపెనీ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో శ్రీనివా్‌సరెడ్డి నియామకం జరిగింది. నింబధనలకు వ్యతిరేకంగా, అనైతికంగా వ్యవహరిస్తుందంటూ ఆండ్రాయిడ్‌కు సంబంధించి గతంలో రూ.1,337 కోట్ల భారీ జరిమానాను గూగుల్‌ ఎదుర్కొంది.

భారత్‌ను అగ్రగామిగా నిలుపుతాం..

భారత్‌లో గూగుల్‌ ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్‌ పాలసీ హెడ్‌గా చేరడం సంతోషంగా ఉందని శ్రీనివాస రెడ్డి అన్నారు. గూగుల్‌కు సంబంధించి ఇక్కడ కొన్ని సమస్యలున్నాయని.. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన అన్నారు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పారు

Updated Date - 2023-10-05T02:14:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising