ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3 : చంద్రయాన్-3 విజయంతో భారత్‌కు భారీ ఆర్థిక ప్రయోజనాలు!

ABN, First Publish Date - 2023-08-24T16:03:07+05:30

చంద్రయాన్-3 విజయవంతమవడంతో మన దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రయోజనాలు చేకూరబోతున్నాయి. 2025 నాటికి మన దేశ రోదసి ఆర్థిక వ్యవస్థ విలువ 13 బిలియన్ డాలర్లు ఉండవచ్చునని అంచనా. స్టార్టప్ కంపెనీలకు పెట్టుబడులతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని చెప్తున్నారు.

న్యూఢిల్లీ : చంద్రయాన్-3 విజయవంతమవడంతో మన దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రయోజనాలు చేకూరబోతున్నాయి. 2025 నాటికి మన దేశ రోదసి ఆర్థిక వ్యవస్థ విలువ 13 బిలియన్ డాలర్లు ఉండవచ్చునని అంచనా. స్టార్టప్ కంపెనీలకు పెట్టుబడులతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని నిపుణులు చెప్తున్నారు.

స్టార్టప్ కంపెనీలకు..

అంతరిక్ష పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానం, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లోని స్టార్టప్ కంపెనీలకు నూతన అవకాశాలు లభిస్తాయని నిపుణులు చెప్తున్నారు. భవిష్యత్తులో రోదసి పరిశోధనలకు బడ్జెట్ కేటాయింపులు పెరిగే అవకాశం ఉందని, ప్రైవేటు పెట్టుబడులు కూడా పెరుగుతాయని చెప్తున్నారు. వీటన్నిటి వల్ల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని అంటున్నారు.

దేశ స్థానం సుస్థిరం

మన దేశంలో ఇప్పటికే 140 రిజిస్టర్డ్ స్పేస్ టెక్ స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. చంద్రయాన్-3 విజయవంతమవడంతో ఈ కంపెనీలన్నిటికీ గొప్ప ప్రోత్సాహం దొరుకుతుంది. చౌక ధరలకు ఉపగ్రహాలను ప్రయోగించడంలో భారత దేశ స్థానం సుస్థిరమవుతుంది. ఫలితంగా ఏరోస్పేస్, రక్షణ రంగం వంటి రంగాలు ప్రయోజనం పొందుతాయి. ప్రస్తుతం ప్రపంచ రోదసి ఆర్థిక వ్యవస్థలో భారత దేశ వాటా 2 శాతం నుంచి 3 శాతం వరకు ఉంది. ఇది రానున్న 8 నుంచి పదేళ్లలో 8 శాతం నుంచి 10 శాతానికి పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న స్టార్టప్ కంపెనీల్లోకి పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.


యువతకు ప్రోత్సాహం

చంద్రయాన్-3 విజయవంతమవడంతో యువత సైన్స్ వైపు మరింత ఎక్కువగా ఆకర్షితులవుతారని నిపుణులు చెప్తున్నారు. అభివృద్ధి చెందుతున్న రంగాలు మరింత బలోపేతమవుతాయని, ప్రపంచంలో మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత దేశం ఎదుగుతుందనే విశ్వాసాన్ని నింపడానికి, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం మరింత విజయవంతమయ్యేందుకు ఈ విజయం దోహదపడుతుందని చెప్తున్నారు. ఉపగ్రహ వ్యవస్థలను అభివృద్ధి చేసే కంపెనీలు, టెలికమ్యూనికేషన్స్ రంగంలోని కంపెనీలు, అన్వేషణ, విడిభాగాల తయారీ, నేవిగేషన్, మ్యాపింగ్, అబ్జర్వేషనల్ డేటా, తదితర కార్యకలాపాలను నిర్వహించే కంపెనీలకు ప్రోత్సాహం లభిస్తుందని చెప్తున్నారు.

స్టాక్ మార్కెట్లపై..

చంద్రయాన్-3 విజయం ప్రభావం ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్లపై కూడా దీర్ఘ కాలంలో ఉంటుందని చెప్తున్నారు. రోదసి పరిశోధన రంగంలో భారత దేశ శక్తి సామర్థ్యాలపై విదేశీ మదుపరుల ఆలోచనల్లో మార్పులు వస్తాయంటున్నారు.


ఇవి కూడా చదవండి :

Chandrayaan-3 : మధ్య తరగతి ప్రజల్లో ఆశలు రేపుతున్న చంద్రయాన్-3 విజయం

Russia : పుతిన్‌పై తిరుగుబాటు చేసిన వాగ్నర్ చీఫ్ ఓ చిల్లర దొంగ!

Updated Date - 2023-08-24T16:03:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising