జైళ్లలో వైద్య సౌకర్యాలపై నివేదిక ఇవ్వండి: సుప్రీం
ABN, First Publish Date - 2023-08-31T02:18:49+05:30
దేశవ్యాప్తంగా ఖైదీలతో కిక్కిరిసిన జైళ్ల పరిస్థితిని విచారిస్తున్న సుప్రీంకోర్టు బుధవారం జైళ్లలోని వైద్య సౌకర్యాలపై వివరాలను తనకు సమర్పించాలని..
న్యూఢిల్లీ, ఆగస్టు 30: దేశవ్యాప్తంగా ఖైదీలతో కిక్కిరిసిన జైళ్ల పరిస్థితిని విచారిస్తున్న సుప్రీంకోర్టు బుధవారం జైళ్లలోని వైద్య సౌకర్యాలపై వివరాలను తనకు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దేశంలోని 1382 జైళ్లలో ఉంటున్న ఖైదీలను విచారణ కోసం కోర్టుల చుట్టూ తిప్పకుండా నేరుగా జైలు నుంచే విచారించేందుకు వీలుగా వీడియో కాన్ఫరెన్సింగ్ ఏర్పాట్లు ఉన్నాయా? అనే విషయంపైనా నివేదిక అడిగింది. జైలులో ఉన్న ఖైదీలను చూసేందుకు వాళ్ల బంధువులకు ఉన్న హక్కులేవో తెలపాలని ఆదేశించింది. అంతేకాకుండా, జైళ్లలో ఖైదీలు నేర్చుకోవడానికి ఉన్న వృత్తి విద్యా శిక్షణ సౌకర్యాలను కూడా నివేదించాలని కోరింది. జస్టిస్ హిమా కొహ్లీ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఈ అంశాన్ని విచారణ చేపట్టింది.
Updated Date - 2023-08-31T02:18:49+05:30 IST