Surat: వెహికిల్ స్క్రాపింగ్ యూనిట్‌ని ప్రారంభించిన టాటా మోటార్స్
ABN, First Publish Date - 2023-09-24T10:20:23+05:30
భారత్(India)లోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ మూడో రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్(Vehicle Scrapping) సదుపాయాన్ని (RVSF) సూరత్(Surat)లో ప్రారంభించింది.
గుజరాత్: భారత్(India)లోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ మూడో రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్(Vehicle Scrapping) సదుపాయాన్ని (RVSF) గుజరాత్ రాష్ట్రం సూరత్(Surat)లో ప్రారంభించింది. ఈ యూనిట్ ఏడాదికి 15 వేల వాహనాలను రీసైకిల్(Recycling) చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. తొలి యూనిట్ రాజస్థాన్ లోని జైపుర్(Jaipur) లో, రెండో యూనిట్ ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో గతంలోనే ప్రారంభించింది.
తాజా యూనిట్ లో వేల సంఖ్యలో వాహనాలను తుక్కు చేసి.. రీసైక్లింగ్ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. ఇక్కడ కమర్షియల్ తదితర వాహనాలను స్క్రాప్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ యూనిట్ స్థానికంగా కొత్త ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందని కంపెనీ అధికారులు తెలిపారు. వాహనాలను తుక్కు చేసేందుకు ఉద్దేశించిన వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ(Vehicle Scrapping Policy) తో కాలుష్యాన్ని తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు.
వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ అంటే..
పాత, కాలుష్యానికి కారమవుతున్న వాహనాలను తుక్కు కింద మార్చడానికి వచ్చే యజమానులకు వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ లబ్ధి చేకూరుస్తోంది. ఇందులో భాగంగా 15 ఏళ్లు పైబడిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్లు పైబడిన పర్సనల్ వెహికిల్స్ ని తుక్కు చేయాల్సి ఉంటుంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ పాలసీ ఉపయోగపడనుంది.
Updated Date - 2023-09-24T10:20:23+05:30 IST