ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘మధ్యప్రదేశ్‌ ’ బరిలో ముగ్గురు కేంద్రమంత్రులు

ABN, First Publish Date - 2023-09-26T01:49:27+05:30

త్వరలో మధ్యప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ ముగ్గురు కేంద్రమంత్రుల్ని, పలువురు ఎంపీలను బరిలోకి దించుతోంది...

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: త్వరలో మధ్యప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ ముగ్గురు కేంద్రమంత్రుల్ని, పలువురు ఎంపీలను బరిలోకి దించుతోంది. భోపాల్‌లో సోమవారం మోదీ ప్రసంగం తర్వాత, వారితో సహా 39మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను పార్టీ విడుదల చేసింది. దిమానీ నియోజకవర్గం నుంచి వ్యవసాయ మంత్రి తోమర్‌, నర్సింగ్‌పూర్‌ నుంచి కేంద్ర జలశక్తి మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌, నివాస్‌ నియోజకవర్గం నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయమంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే బరిలో ఉన్నారు. ఇక ఇండోర్‌-1 సీటు నుంచి బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాశ్‌ విజయవర్గీయ పోటీ చేయనున్నారు. ఎంపీల విషయానికొస్తే.. గదర్వారా సీటులో ఎంపీ ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌, సిద్ధి స్థానం నుంచి ఎంపీ రితి పాఠక్‌, సత్నాలో ఎంపీ గణేశ్‌ సింగ్‌ బీజేపీ అభ్యర్థులుగా ఉన్నారు.

Updated Date - 2023-09-26T01:49:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising