ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajasthan result: కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. రాజస్థాన్ ఎన్నికల ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ!

ABN, First Publish Date - 2023-12-03T07:20:52+05:30

రాజస్థాన్ ఎన్నికల ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీజేపీకే ఎగ్జిట్ పోల్స్ విజయం కట్టబెట్టిగా అధికార పక్షంతో కాషాయం పార్టీకి గట్టిపోటీ తప్పదన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: మరికాసేపట్లో రాజస్థాన్‌లో ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏ పార్టీకీ రెండోసారి అధికారం కట్టపెట్టని రాజస్థాన్ ఓటర్లు ఈసారీ ఆ ఆనవాయితీని కొనసాగిస్తారా లేక కాంగ్రెస్‌ను మళ్లీ ఎన్నుకుంటారా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి విజయం దక్కుతుందని చెబుతున్నాయి.

రాష్ట్రంలో రెండు పార్టీలూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి. ఎన్నికల వ్యూహాల్లో ఆరితేరిన బీజేపీ తరపున కేంద్ర మంత్రులు, ప్రధాని కూడా ప్రచారం చేశారు. కాంగ్రెస్ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ఓటర్‌కు దగ్గరయ్యేలా క్యాంపెయిన్ నిర్వహించింది. తమదే విజయమని కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెబుతుండగా బీజేపీ కూడా గెలుపు తమదే అంటూ ఘంటాపథంగా చెబుతోంది. అయితే, ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈ ఎన్నికలు గెహ్లాట్‌కు పెద్ద పరీక్షేనని స్పష్టం చేశాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో జరిగిన తొమ్మిది ఎగ్జిట్ పోల్స్‌లో ఎనిమిది.. గెలుపు బీజేపీదేనని తేల్చాయి. కాషాయం పార్టీకి సగటున 104 ఓట్లు, కాంగ్రస్‌కు 86 ఓట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ సరళి చెబుతోంది.


2018లో ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఇచ్చిన బీజేపీ, విజయానికి అడుగు దూరంలో నిలిచిపోయింది. ఇక, కాంగ్రెస్, బీజేపీల ఎన్నికల వాగ్దానాల్లో పెద్దగా తేడా లేకపోవడంతో పాటు ప్రతి ఐదేళ్లకోసారి అధికార పక్షాన్ని గద్దె దించే ఆనవాయితీ ఉన్న రాజస్థాన్‌లో ఈసారి కాషాయం పార్టీకి విజయావకాశాలు మెరగయ్యాయనేది ప్రధానంగా వినిపిస్తున్న విశ్లేషణ. యువత, రైతులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాలకు కాంగ్రెస్ బీజేపీలు స్వల్ప తేడాతో దాదాపుగా ఒకేతరహా వాగ్దానాలు చేశాయి. వంట గ్యాస్ సిలిండర్‌ను రూ.450కే అందిస్తామని బీజేపీ చెబుతుంటే కాంగ్రెస్ రూ.500లకు సిలిండర్ ఇస్తామని తన మేనిఫెస్టోలో ప్రకటించింది.

రెండు పార్టీలూ గత కొంతకాలంగా అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నాయి. సీఎం కుర్చీపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్..ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో గత కొన్నేళ్లుగా విభేదిస్తున్నారు. ఇరు నేతల విభేదాల కారణంగా ఒకానొక దశలో ప్రభుత్వానికే ముప్పు ఏర్పడగా రాహుల్ గాంధీ జోక్యం సచిన్ పైలట్ అప్పట్లో వెనక్కుతగ్గారు. ఈసారి కాంగ్రెస్ విజయం సాధిస్తే గెహ్లాట్‌కు సీఎం సీటు కాదనడం హస్తం పార్టీ అధిష్టానానికి కష్టం కావచ్చన వ్యాఖ్యా వినిపిస్తోంది. ఇక బీజేపీలో ప్రముఖ నేత వసుంధర రాజే‌ను సీఎం అభ్యర్థిగా పార్టీ ప్రకటించనప్పటికీ ఆమెతో పాటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ సీపీ జోషి, కేంద్ర మంత్రి గజేంద్ర షెఖావత్, దియా కుమారి, బాబా బాలక్‌నాథ్ వంటి ముఖ్య నేతలు సీఎం కుర్చీపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో, ఈసారి ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఊహించని పరిణామాలు కూడా ఉంటాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-12-03T07:25:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising