Uttarakashi: టన్నెల్‌లోని కార్మికులతో మాట్లాడిన పుష్కర్ సింగ్ ధామి.. బయటకి రాబోతున్నారంటూ భరోసా
ABN, First Publish Date - 2023-11-23T21:29:02+05:30
ఉత్తరాఖండ్ లోని ఉత్తర్ కాశీ సిల్క్యారా టన్నెల్(Uttarakashi Tunnel Rescue) ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులతో ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ(Pushkar Singh Dhami) సంభాషించారు. ధైర్యంగా ఉండాలని.. మరి కొన్ని గంటల్లో బయటకి వస్తారని భరోసా ఇచ్చారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ లోని ఉత్తర్ కాశీ సిల్క్యారా టన్నెల్(Uttarakashi Tunnel Rescue) ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులతో ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ(Pushkar Singh Dhami) సంభాషించారు. ధైర్యంగా ఉండాలని.. మరి కొన్ని గంటల్లో బయటకి వస్తారని భరోసా ఇచ్చారు. టన్నెల్ కూలడంతో 10 రోజులకు పైగా 41 మంది కార్మికులు అందులో చిక్కుకున్న విషయం విదితమే. మరికొన్ని గంటల్లో వారందరినీ బయటకు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. బయటకి వచ్చిన వెంటనే వైద్య సాయం అందించే ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే అంబులెన్స్ లు, 41 పడకల ఆసుపత్రి, మెడిసిన్లు, ఆక్సిజన్ కిట్లు అందుబాటులో ఉంచారు. సహాయక చర్యల పర్యవేక్షణలో భాగంగా సీఎం టన్నెల్ వద్దకు వెళ్లి కూలీలతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
ఆయన మాట్లాడుతూ.. "45 మీటర్ల దూరం వరకు వచ్చాం. అతి చేరువలో ఉన్నాం. ధైర్యంగా ఉండండి. మీ గుండె నిబ్బరానికి హ్యాట్సాఫ్. బయటకి తీసుకొచ్చేందుకు అన్ని శాఖల అధికారులు అహర్నిషలు కష్టపడుతున్నారు. మరి కొన్ని గంటల్లో బయటిప్రపంచాన్ని చూడబోతున్నారు. ప్రధాని మోదీ ఇవాళ ఉదయం నాతో మాట్లాడారు. మీ అందరి పరిస్థితిపై ఆరా తీశారు" అని అన్నారు.
సీఎం వెంట కేంద్ర మంత్రి వీకే సింగ్ ఉన్నారు. అనంతరం పుష్కర్ సింగ్ కార్మికుల కుటుంబాల్లో కూడా ధైర్యం నింపారు. మరి కొన్ని గంటల్లో బయటకు రాబోతున్నందునా అధైర్యపడొద్దని సూచించారు.
Updated Date - 2023-11-23T21:29:05+05:30 IST