Uttarakhand: బిన్సార్ అభయారణ్యంలో తొలిసారి కనిపించిన పులి..
ABN, Publish Date - Dec 16 , 2023 | 11:07 AM
సముద్ర మట్టానికి 2,250 మీటర్ల ఎత్తులో ఉన్న బిన్సార్(Binsar Forest) వన్యప్రాణుల అభయారణ్యంలో మొదటిసారిగా ఒక పులి(Tigers) కనిపించింది.
ఉత్తరాఖండ్: సముద్ర మట్టానికి 2,250 మీటర్ల ఎత్తులో ఉన్న బిన్సార్(Binsar Forest) వన్యప్రాణుల అభయారణ్యంలో మొదటిసారిగా ఒక పులి(Tigers) కనిపించింది. అభయారణ్యం లోపల వాహనం దాటుతుండగా దీని ఆనవాళ్లు తారసపడ్డాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోరా జిల్లాలో 46 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అభయారణ్యం సుసంపన్నమైన జీవవైవిధ్యం, ప్రకృతి అందాలకు నెలవుగా ఉంది.
"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"
ఇది చిరుతపులులు, మొరిగే జింకలు, అడవి పంది, హిమాలయన్ బ్లాక్ ఎలుగుబంటి, 200 రకాల పక్షులు సహా వివిధ రకాల వన్యప్రాణులకు నిలయంగా ఉంది. అభయారణ్యంలోని బిందేశ్వర్ మహాదేవ్ టెంపుల్ పేరు మీదుగా ఈ అడవికి నామకరణం చేశారు.
క్రీ.శ. 11 నుండి 18వ శతాబ్దాల వరకు కుమావోన్‌ను పాలించిన చాంద్ రాజులు బిన్సార్ ని వేసవికాలంలో రాజధానిగా చేసుకుని పాలించేవారు. ఉత్తరాఖండ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫీసర్, IFS డాక్టర్ పి.ఎం. ధాకటే పులి రోడ్డు దాటుతున్న వీడియోను ఎక్స్(X) అకౌంట్లో పంచుకున్నారు. ఈ అభయారణ్యంలో పులి జాడలు కనిపించడం తొలిసారి. సాధారణంగా పులులు తక్కువ ఎత్తులో నివసిస్తాయి.
ఇటీవల వెలువరించిన పులుల గణాంకాల ప్రకారం.. ఉత్తరాఖండ్ లో 560 పులులున్నాయి. అత్యధికంగా కార్బెట్ టైగర్ రిజర్వ్ లో కేంద్రీకృతమై ఉన్నాయి. బిన్సార్ లో పులి ఆనవాళ్లు కనిపించడంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ అడవి చుట్టు ఉన్న జనావాసాలు పులి మనుగడకు ప్రమాదకరంగా మారుతాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
దానిని రక్షించడం అటవీ శాఖకు సవాలుగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రధాని మోదీ స్టేటస్ ఆఫ్ టైగర్స్ 2022 నివేదిక విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం.. భారత్ లో సుమారు 3,167 పులులున్నాయి.
Updated Date - Dec 16 , 2023 | 11:08 AM