ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delhi: పార్లమెంటు ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు రేపు..

ABN, First Publish Date - 2023-09-19T07:11:00+05:30

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు బుధవారం పార్లమెంటు ముందుకు రానుంది. బిల్లు ఆమోదం పొందే సమయానికి భారీగా వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు (Womens Reservation Bill) బుధవారం పార్లమెంటు (Parliament) ముందుకు రానుంది. బిల్లు ఆమోదం పొందే సమయానికి భారీగా వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీ (Delhi) పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి (PM Modi) కృతజ్ఞతలు చెప్పేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీ - నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) చర్చించారు. ఢిల్లీ సమీప ప్రాంతాల నుంచి భారీగా మహిళల సమీకరణకు నిర్ణయించారు. బీజేపీ బుధవారం లేదా ఒక రోజు తర్వాత ఢిల్లీలో లేదా ఢిల్లీకి ఆనుకుని ఉన్న రాజస్థాన్‌లోని ఏదైనా నగరంలో భారీ మహిళా సదస్సు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఆ సదస్సులో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొని ప్రసంగించనున్నట్టు సమాచారం.

కాగా దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రేపు (బుధవారం) కొత్త పార్లమెంట్ భవనంలో ఈ బిల్లునను ప్రవేశపెట్టనున్నారు. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే.. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి వీలవుతుంది. దీంతో పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న మరికొన్ని బిల్లులకు సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సమాచారం.

Updated Date - 2023-09-19T11:27:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising