ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yogi Adithyanath: అలాంటి వారి ఇళ్లు కూల్చకుండా.. హారతి పట్టాలా?: యూపీ సీఎం యోగి

ABN, First Publish Date - 2023-08-01T20:09:42+05:30

నేరాలు, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఇళ్లను యోగి ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ బుల్డోజర్ యాక్షన్ పట్ల కొందరు వ్యతిరేకత చూపుతున్నారు. ఒక్కరు చేసిన పాపానికి ఇల్లు మొత్తం కూల్చేసి.. వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడేలా చేయడం ఎంతవరకు సమంజసం?

Yogi Adithyanath: అలాంటి వారి ఇళ్లు కూల్చకుండా.. హారతి పట్టాలా?: యూపీ సీఎం యోగి

నేరాలు, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఇళ్లను యోగి ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ బుల్డోజర్ యాక్షన్ పట్ల కొందరు వ్యతిరేకత చూపుతున్నారు. ఒక్కరు చేసిన పాపానికి ఇల్లు మొత్తం కూల్చేసి.. వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడేలా చేయడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కేవలం నేరాలు చేసిన నిందితుల్ని, అక్రమాలకు పాల్పడిన అక్రమార్కుల్ని మాత్రమే శిఖించాలే తప్ప.. ఇలా ఇళ్లు కూల్చడం సరైన చర్య కాదంటూ మండిపడుతున్నారు.

అయితే.. సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఆ విమర్శల్ని, ప్రశ్నల్ని బేఖాతరు చేస్తూ.. ఈ బుల్డోజర్ యాక్షన్‌ను సమర్థించుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే.. వారిపై తప్పకుండా చర్యలు తీసుకోబడతాయని తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలంటే.. బుల్డోజర్లు, ఆధునిక యంత్రాలు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందాలంటే.. కావాల్సింది పారలు, పలుగులు కాదన్నారు. ఇంతకుముందు ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్ట్‌కి అనుమతి వస్తే.. మాఫియా ముందుగానే అక్కడికి చేరుకొని, అక్రమాలకు పాల్పడేదని అన్నారు. అప్పటి ప్రభుత్వాలు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయాయన్నారు. కానీ.. తమ ప్రభుత్వ హయాంలో అవినీతికి తావు లేకుండా చేస్తున్నామని చెప్పారు.


మరి.. నేరస్తుల ఇళ్లను బుల్డోజర్లతో ఎందుకు కూలుస్తున్నారు? అని ప్రశ్నించినప్పుడు.. అలాంటి వారి ఇళ్లను కూల్చకుండా, వారికి హారతి పట్టాలా? అని తిరిగి ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు ఆ మాఫియాకు హారతులు పట్టేవని.. అలాంటి వారికి బుద్ధి రావాలంటే, వారి ఇళ్లు బుల్డోజర్లతో కూల్చాల్సిందేనని అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు నేరస్తులు, మాఫియాపై యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారని, తాము అదే చేస్తున్నామని యోగి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తాము కేవలం మైనార్టీలనే టార్గెట్ చేస్తున్నామని వస్తున్న ఆరోపణల్ని తోసిపుచ్చారు. తప్పు చేయని ఏ ఒక్క ముస్లిం కూడా తనకు అన్యాయం జరుగుతోందని ఫిర్యాదులు చేసిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సమాన సరిపాలన, భద్రత అమలవుతోందని చెప్పారు.

Updated Date - 2023-08-01T20:09:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising