ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: చంద్రయాన్-3 సాధించిన అరుదైన ఘనత.. ఇస్రోకి శుభాకాంక్షలు తెలిపిన యూట్యూబ్ చీఫ్

ABN, First Publish Date - 2023-09-14T17:16:38+05:30

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రుని దక్షిణ ధ్రవంపై కాలుమోపి, ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటలకెక్కింది...

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రుని దక్షిణ ధ్రవంపై కాలుమోపి, ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటలకెక్కింది. అనంతరం.. 14 రోజుల మిషన్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు జరిపి, భూమికి ఎంతో కీలకమైన సమాచారాలను అందజేశాయి. గతంలో చేపట్టిన ప్రయోగాలతో పోలిస్తే.. ఈ చంద్రయాన్-3 మిషన్ గొప్ప పనులే సాధించింది. అంతేకాదండోయ్.. చంద్రునిపై కాలుమోపే సమయంలోనూ ఈ మూన్ మిషన్ కనీవినీ ఎరుగని ఓ అరుదైన ఘనత సాధించింది.


అదేంటి అనుకుంటున్నారా? ఆగస్టు 23వ తేదీన ‘చంద్రయాన్-3’ చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవుతున్న సమయంలో, దీనిని ఇస్రో సంస్థ యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ లైవ్ స్ట్రీమింగ్‌ని 80 లక్షలకు (8 మిలియన్) పైగా యూజర్లు చూశారు. దీంతో.. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించబడిన లైవ్ స్ట్రీమింగ్‌గా చరిత్ర సృష్టించింది. ఇందుకు గాను తాజాగా యూట్యూబ్ చీఫ్ నీల్ మోహన్ ఇస్రోకు ట్విటర్ (X ప్లాట్‌ఫామ్) మాధ్యమంగా శుభాకాంక్షలు తెలియజేశారు. యూట్యూబ్ ఇండియా ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ.. ‘‘ఇది ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. ఏకకాలంలో 8 మిలియన్ల వ్యూస్ పొందడం నిజంగా నమ్మశక్యంగా లేదు. ఈ ఘనత సాధించినందుకు ఇస్రో టీమ్‌కి శుభాకాంక్షలు’’ అంటూ నీల్ మోహన్ ట్వీట్ చేశారు.

ఇదిలావుండగా.. చంద్రునిపై ఇప్పుడు రాత్రివేళ కావడంతో, దక్షిణ ద్రువంలో ఉన్న చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్‌లు నిద్రావస్థలో ఉన్నాయి. తమ మిషన్‌లో భాగంగా ల్యాండర్, రోవర్‌లు ఎన్నో పరిశోధనలు జరిపి.. అక్కడ సల్ఫర్‌తో ఇతర మూలకాల ఉనికిని కనుగొన్నాయి. అలాగే.. ఉష్ణోగ్రత రిపోర్ట్‌ని సైతం భారత్‌కు పంపాయి. ఈ చంద్రయాన్-3 మిషన్‌తో.. అమెరికా, చైనా, రష్యా తర్వాత చంద్రునిపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. చంద్రునిపై తిరిగి సూర్యోదయం అయిన తర్వాత.. ల్యాండర్, రోవర్ తిరిగి మేల్కొనే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే.. చంద్రునిపై మరిన్ని పరిశోధనలు చేయడానికి వీలుగా ఉంటుంది.

Updated Date - 2023-09-14T17:55:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising