ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gold Hallmarking: బంగారం కొంటున్నారా..? బీ కేర్‌ఫుల్.. హాల్‌మార్కింగ్ అసలుదో.. నకిలీదో ఎలా తెలుసుకోవాలంటే..!

ABN, First Publish Date - 2023-11-11T00:38:33+05:30

క్యారెట్ నగల వ్యాపారులు తక్కువ క్యారెట్ ఆభరణాలను అధిక క్యారెట్ ధరలకు అమ్ముతూ ఉంటారు. దీన్ని ఆపాలనే ముఖ్య ఉద్దేశ్యంతోనే హాల్ మార్కింగ్ ను తప్పనిసరి చేసారు. కొనుగోలుదారులు హాల్‌మార్కింగ్ గుర్తును చూడటం ద్వారానే కొనుగోళ్లు చేస్తారు.

hallmarking

బంగారం సగటు పేదవాడి నుంచి ధనికుల వరకూ బంగారాన్ని కొని దాచుకోవాలనుకుంటారు. అలంకరణ వస్తువుగానే కాకుండా, మంచి లాభాలను తెచ్చే వ్యాపారంగా కూడా బంగారం మీద పెట్టుబడి పెడుతుంటారు. మరి ఇంత నమ్మకంగా కొనే బంగారం అసలు మంచిదేనా..? ఎందుకంటే పెట్టుబడిగానే కాకుండా బంగారం రోజు రోజుకూ విలువ పెరిగే వస్తువుగా మంచి రాబడి తెచ్చిపెట్టే పెట్టుబడి. అయితే మనం పెట్టే ప్రతి రూపాయికీ సరైన న్యాయం జరుగుతుందా లేదా అనే విషయంలో చాలా అనుమానాలుంటాయి.సరైన బంగారమే కొంటున్నామా.. లేదా కొన్న బంగారం హల్ మార్కింగ్ చేసినదేనా ఇలా చాలా అనుమానాలు వేధిస్తూ ఉంటాయి. అయితే కొందరు హాల్ మార్కింగ్ లో కల్తీలకు పాల్పడుతున్నారనేది హాల్ మార్కింగ్ ఫెడరేషన్ ఆప్ ఇండియా అంగీకరించింది. అసలు కొనే బంగారం హాల్ మార్కింగ్ దేనా అని ఎలా గుర్తించాలి.

హాల్ మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతకు హామీ పత్రం లాంటిది. ఇది ప్రతి ఆభరణంపైనా ఉంచబడే గుర్తు. ఇందులో ముఖ్యంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లోగో, దాని స్వచ్ఛత ఇవ్వబడుతుంది. దీనితో పాటు పరీక్షా కేంద్రాల గురించిన సమాచారం కూడా ఇందులో ఉంటుంది. ఒక ఆభరణంలో బంగారం పరిమాణం మారుతూ ఉంటుంది కనుక దాని స్వచ్ఛత, ఆధారంగా నిర్ణయించబడుతుంది. అంటే క్యారెట్ నగల వ్యాపారులు తక్కువ క్యారెట్ ఆభరణాలను అధిక క్యారెట్ ధరలకు అమ్ముతూ ఉంటారు. దీన్ని ఆపాలనే ముఖ్య ఉద్దేశ్యంతోనే హాల్ మార్కింగ్ ను తప్పనిసరి చేసారు. కొనుగోలుదారులు హాల్‌మార్కింగ్ గుర్తును చూడటం ద్వారానే కొనుగోళ్లు చేస్తారు. కొనుగోలు సమయంలో ఆభరణాలపై ఉన్న గుర్తు నిజమైనదా, నకిలీదా అనేది గుర్తించడం సాధ్యం కాదు కాబట్టి. నకిలీ హాల్‌మార్కింగ్ ఆభరణాలను విక్రయించే వ్యాపారులు ఈ అవకాశాన్ని వాళ్లకు తగినట్టుగా సద్వినియోగం చేసుకుంటున్నారు.

హాల్‌మార్కింగ్ తెలుసుకోండి:

బంగారు ఆభరణాలకు సంబంధించిన హాల్‌మార్కింగ్ గుర్తులను ప్రభుత్వం గతేడాది జూలై 1 నుంచి మార్చి, వాటి సంఖ్యను మూడుకు పెంచింది. మొదటి సంకేతం BIS హాల్‌మార్క్. ఇది త్రిభుజాకార గుర్తు. రెండవ సంకేతం స్వచ్ఛత గురించి చెబుతుంది. అంటే ఆ నగలు ఎన్ని క్యారెట్ల బంగారంతో తయారు చేశారో చూపిస్తుంది. మూడవ అక్షరం HUID నంబర్ అని పిలువబడే ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్. HUID అంటే హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఈ ఆరు అంకెల కోడ్‌లో అక్షరాలు, అంకెలు ఉంటాయి. హాల్‌మార్కింగ్ సమయంలో, ప్రతి ఆభరణానికి HUID నంబర్ కేటాయించబడుతుంది. ఈ సంఖ్య ప్రత్యేకమైనది. అంటే రెండు ఆభరణాలు ఒకే HUID సంఖ్యను కలిగి ఉండకూడదు.

ఇది కూడా చదవండి: మగాళ్లూ.. పెళ్లికి ముందే ఇవి తెలుసుకోండి.. సంతానలేమికి ఈ 6 అంశాలూ కారణాలే..!

అసలు, నకిలీని గుర్తించడం ఇలా..

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రూపొందించిన BIS కేర్ యాప్ అనే మొబైల్ యాప్‌తో హాల్‌మార్క్ చేయబడిన ఆభరణాలను తనిఖీ చేయవచ్చు. బిఐఎస్ కేర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, అందులో పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ ఐడిని నమోదు చేయాలి. అప్పుడు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ID OTT ద్వారా ధృవీకరించాలి. ధృవీకరణ తర్వాత మాత్రమే ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు. ఇందులో వెరిఫై హెచ్‌యూఐడీ విభాగంలోకి వెళ్లి హెచ్‌యూఐడీ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా ఆభరణాల నాణ్యత, తయారీ తదితరాలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందే వీలుంటుంది. ఎంతో శ్రమకు ఓర్చి కొనుగోలు చేసిన బంగారం విషయంలో కాస్త అప్రమత్తత అవసరం. మోసాలకు ఓ క్షణకాలం సరిపోతుంది. అందుకే హాల్ మార్క్ విషయంలో పై జాగ్రత్తలు తప్పనిసరి.

Updated Date - 2023-11-11T00:38:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising