Rice Water: బియ్యం కడిగిన నీళ్లను ముఖానికి రాసుకుంటే మంచిదని విన్నారా..? అయితే ఈ 7 నిజాలు తెలుసుకోవాల్సిందే..!
ABN, First Publish Date - 2023-07-29T14:23:16+05:30
సాయంత్రం పూట అన్నం నీళ్లను ముఖానికి పట్టించడం వేరు, ఉదయం చేసే విధానం వేరు. ఉదయం రైస్ వాటర్ తర్వాత సీరం, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ అప్లై చేయవచ్చు.
చర్మ సౌందర్యానికి రకరకాల ఉత్పత్తులను వాడేస్తూ ఉంటాం. కానీ ఇవి ఒక్క చర్మానికే వాడిన వీటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా రకాలుగా ఉంటుంది. అయితే మార్కెట్ లో దొరికే ప్రతి ప్రోడక్ట్ చర్మం అందాన్ని పెంచేయదు. వీటితో కొన్ని ఇబ్బందులూ తప్పవు. అందుకే చర్మ సంరక్షణలో రైస్ వాటర్ కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కొరియన్ చర్మ సంరక్షణలో బియ్యం ఎక్కువగా ఉపయోగిస్తారు. అది రైస్ వాటర్ టోనర్, ఫేస్ వాష్, రైస్ ఫ్లోర్ ఫేస్ మాస్క్, క్రీమ్ మరేదైనా కావచ్చు.
కానీ, రైస్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ను బయటి నుంచి కొనే బదులు ఇంట్లోనే ముఖానికి రైస్ వాటర్ వాడుకోవచ్చు. రైస్ వాటర్ చర్మానికి ఒకటి కాదు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలతో నిండి ఉంది, దీని కారణంగా చర్మం యవ్వనంగా ఉంటుంది. బియ్యం నీరు ముఖాన్ని ప్రకాశవంతం చేయడం, మచ్చలను తొలగించడం, వడదెబ్బ నుండి ఉపశమనం కలిగించడం వంటి ఉపయోగాలను అందిస్తుంది. అలాగే చర్మం నుండి అదనపు జిడ్డును తొలగించడంలో కూడా ప్రభావాన్ని చూపుతుంది. రైస్ వాటర్ తయారు చేసి ముఖానికి అప్లై చేయాలంటే మరికొన్ని చిట్కాలు ఉన్నాయి.
1. బియ్యం నీటిని తయారు చేయడానికి ఏదైనా ఆసియా బియ్యాన్ని ఉపయోగించవచ్చు. బియ్యాన్ని నీటిలో నానబెట్టడానికి చల్లటి నీటిని ఉపయోగించండి.
2. బియ్యాన్ని మూడుసార్లు కడిగి మూడోసారి నీటిని నిల్వ చేసి ఉంచుకోవాలి.
3. ఈ బియ్యం నీటిని దాదాపు 2 వారాల పాటు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవచ్చు.
ఇది కూడా చదవండి: ఈ 3 టిప్స్ తెలియక ఎన్నిసార్లు ఇబ్బంది పడుంటారో.. తెల్లటి దుస్తులపై మరకలు పడితే.. పోగొట్టడం యమా ఈజీ..!
4. బియ్యం నీళ్లను నేరుగా ముఖంపై చిలకరించడం, స్ప్రే బాటిల్‌లో నింపి ముఖంపై స్ప్రే చేసి గాలికి ఆరనివ్వడం ఉత్తమ మార్గం.
5. సాయంత్రం పూట అన్నం నీళ్లను ముఖానికి పట్టించడం వేరు, ఉదయం చేసే విధానం వేరు. ఉదయం రైస్ వాటర్ తర్వాత సీరం, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ అప్లై చేయవచ్చు. రాత్రి పూట ముఖం కడుక్కొని రైస్ వాటర్ అప్లై చేసి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
6. బియ్యం నీటిని ముఖంపై అన్ని సమయాలలో అప్లై చేయకూడదు.
Updated Date - 2023-07-29T14:23:16+05:30 IST