Relation: మీ బంధం పదిలంగా ఉండాలంటే ఈ ఐదు తప్పులూ చేయకండి..
ABN, Publish Date - Dec 23 , 2023 | 06:29 PM
బంధాలనేవి గాజు బొమ్మల్లాంటివి. ఎంతో పదిలంగా, జాగ్రత్తగా చూసుకుంటే తప్ప సురక్షితంగా ఉండవు. భాగస్వాముల మధ్య ప్రేమ, అర్థం చేసుకునే తత్వం, రాజీ పడడం వంటి లక్షణాలు ఉంటేనే ఆ బంధంగా దృఢంగా ఉంటుంది.
బంధాలనేవి గాజు బొమ్మల్లాంటివి. ఎంతో పదిలంగా, జాగ్రత్తగా చూసుకుంటే తప్ప సురక్షితంగా ఉండవు. భాగస్వాముల మధ్య ప్రేమ, అర్థం చేసుకునే తత్వం, రాజీ పడడం వంటి లక్షణాలు ఉంటేనే ఆ బంధంగా దృఢంగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్‌షిప్ బ్రేక్ అవడానికి ఎవరో ఒకరి ప్రవర్తన కారణం కావొచ్చు. ఏదైనా ఒక రిలేషన్‌లో ఉన్నప్పుడు చేయకూడని తప్పులేంటో ఒకసారి తెలుసుకుందాం.
కమ్యూనికేషన్
మనం ఏమీ చెప్పకుండానే మన మనసులోని భావాలను, కోరికలను ఎదుటివారు అర్థం చేసుకోవాలనుకోవడం తగదు. మీ మనస్సులోని కోరికలను మీ భాగస్వామికి చెప్పకపోవడం అనేది చాలా అపార్థాలకు కారణమవుతుంది. ఎదుటివారిపై మీకు అసంతృప్తి మొదలవుతుంది. కాబట్టి మీరు ఏం అనుకుంటున్నారో, ఏం కోరుకుంటున్నారో చక్కగా ఎదుటి వారికి వ్యక్తీకరించాలి.
సమర్థించుకోవడం..
ఎప్పుడూ మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం చాలా పెద్ద తప్పు. ఏ తప్పు జరిగినా ఎదుటి వారిదే తప్పని, మీరు కరెక్ట్ అని వాదించడం మీ బంధాన్ని బలహీనపరుస్తుంది. ఇద్దరి మధ్యా గొడవలు పెరుగుతాయి.
అవాయిడ్ చేయడం..
మీ భాగస్వామిని విస్మరించడం, వారి డిమాండ్లను పట్టించుకోకపోవడం, వారికి విలువ ఇవ్వకపోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. వారు మీకు ఎంత విలువైన వారో వీలైనప్పుడల్లా అర్థమయ్యేలా చెబుతూ ఉండాలి.
ఫిర్యాదులు
ఎప్పుడూ ఎదుటి వారిలోని లోపాలను వెతకడం, వాటిని పదే పదే ప్రస్తావించడం మీ బంధాన్ని విషపూరితం చేస్తుంది. ఎప్పుడూ ఒకరిపై మరొకరు కంప్లైంట్స్ చేసుకోకూడదు. భాగస్వామి తప్పు చేసినా రాజీ పడేందుకు సిద్ధంగా ఉండాలి.
``నాలాగే ఉండు`` అనే మనస్తత్వం..
మన భాగస్వామి కూడా మనలాగే ఉండాలని, మనలాగే ప్రవర్తించాలని కోరుకోవడం తప్పు. మీకు నచ్చినట్టుగానే ఉండాలని ఎదుటి వ్యక్తిని బలవంతం చేయడం మానుకోవాలి. వారి ఇష్టాఇష్టాలను గౌరవించకపోతే ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు.
Updated Date - Dec 23 , 2023 | 06:29 PM