ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anti-Aging Tips: వయసు పెరుగుతున్నా ఇంకా యంగ్‌గా కనిపించాలంటే.. ఈ మూడు టిప్స్‌ను తప్పక పాటిస్తే సరి..!

ABN, First Publish Date - 2023-08-28T11:04:21+05:30

రెటినోల్‌ను రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల ముడతల సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు.

washing the face

వయసు ఎంత పెరుగుతున్నా, కొందరికి ముఖం మీద చర్మం అందంగా నిగారింపుతో కనిపిస్తూ ఉంటుంది. ఇదే మరికొందరిలో తక్కువ వయసైనా, వయసుతో నిమిత్తం లేకుండా ముఖం పై ముడతలు, చర్మం నిగారింపును కోల్పోయి కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య ఇప్పటి రోజుల్లో చాలామందిలో ఉంటూ వస్తున్న సమస్యే అయినా, వయసు పెరుగుతున్నా ఇంకా యంగ్ గా కనిపించేందుకు కొన్ని చిట్కాలను పాటించి అందమైన ముఖాన్ని పొందవచ్చు.. అదెలాగంటే..

యాంటీ ఏజింగ్ చిట్కాలు కొల్లాజెన్ అనేది మన శరీరానికి అనేక విధాలుగా మద్దతును ఇచ్చే ప్రోటీన్ల సమూహం. శరీరంలో ఈ ప్రొటీన్ లోపం ఏర్పడితే మాత్రం దీనివల్ల చర్మం ఎక్కువగా ప్రభావితం అవుతుంది. చర్మం వదులుగా మారడం, ముడతలు, మొటిమలతో పాటు వయసు పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలంటే మాత్రం కొన్ని చిట్కాలను పాటించక తప్పదు.

మూడు పదుల వయసు దాటుతుందనగానే ముఖ చర్మంలో వచ్చే మార్పులను కాస్త గమనిస్తూ ఉండాలి. ఇంకాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేదంటే మనకు తెలియకుండానే మనపై దాడిచేసే ఇబ్బందితో త్వరగా పెద్దవాళ్ళలా కనిపిస్తారు. దీనికి కొల్లాజెన్ కూడా ఒక కారణం. శరీరంలో సమానమైన మోతాదులో ఉండి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముడతలు లేకుండా చేస్తుంది. వృద్ధాప్యంలో కూడా యవ్వనంగా ఉండాలనుకుంటే, పెరుగుతున్న కొల్లాజెన్‌పై శ్రద్ధ వహించాలి.

ఇది కూడా చదవండి: ముఖానికి రాసుకునే క్రీమ్స్ కోసమే వేలల్లో ఖర్చు చేస్తున్నారా..? పసుపులో ఈ రెండింటినీ కలిపి రాసుకుంటే..!


కొల్లాజెన్ అంటే ఏమిటి?

కొల్లాజెన్ అనేది మన శరీరంలో ఉండే ఫైబరస్ ప్రొటీన్. శరీరంలో కనిపించే ప్రోటీన్‌లో మూడింట ఒక వంతు కొల్లాజెన్, ఇది మన ఎముకలు, కండరాలు, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచడానికి అవసరం. ఇది కాకుండా పెరుగుతున్న వయసు కూడా కొల్లాజెన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. కాబట్టి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే కొన్ని చర్యల గురించి తెలుసుకుందాం.

కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే మార్గాలు..

1. విటమిన్ సి సీరం వాడకం..

విటమిన్ సి అనేది యాంటీఆక్సిడెంట్, ఇది అతి నీలలోహిత కిరణాల ద్వారా చర్మంలోని కొల్లాజెన్‌ను దెబ్బతీయకుండా కాపాడుతుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని కోసం, ఉదయం ముఖం కడిగిన తర్వాత, విటమిన్ సి సీరమ్‌ను పూస్తూ ఉండండి.

2. రెటినాయిడ్స్ వాడకం..

రెటినోయిడ్స్ లేదా రెటినోల్ విటమిన్ ఎ అద్భుతమైన మూలం, ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. రెటినోల్‌ను రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల ముడతల సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు.

3. సన్‌స్క్రీన్ వాడకం..

సన్‌స్క్రీన్ స్కిన్ టానింగ్‌ను నిరోధించడమే కాకుండా, చర్మాన్ని యవ్వనంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఎక్కువ సూర్యరశ్మికి గురికావడం వల్ల కొల్లాజెన్ చర్మానికి సరిగా అందకపోవచ్చు. దీని కారణంగా ముఖంపై గీతలు, ముడతలు కనిపించడం ప్రారంభిస్తాయి, కాబట్టి ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించాలనుకుంటే, వేసవిలో మాత్రమే కాకుండా ప్రతి సీజన్‌లో సన్‌స్క్రీన్‌ను అప్లై చేస్తూ ఉండాలి.

Updated Date - 2023-08-28T11:04:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising