ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Tips: వయసు పెరుగుతున్నా సరే.. యంగ్‌గా కనిపించాలా..? ఈ నీళ్లతో చేసిన ఐస్ క్యూబ్స్‌ను ముఖానికి రాసుకుంటే..!

ABN, First Publish Date - 2023-08-23T16:04:16+05:30

ఈ పులియబెట్టిన బియ్యం నీటిని ఐస్ క్యూబ్స్ గా తయారుచేసి ముఖానికి అప్లై చేయవచ్చు.

making ice cubes

అందమైన ముఖాన్ని మరింత అందంగా ఉంచాలంటే హోమ్ రెమిడీస్ సరిగ్గా సరిపోతాయి. బయట మార్కెట్ లో దొరికే చాలా ఉత్పత్తుల్లో కెమికల్స్ వల్ల ముఖ చర్మం పాడవుతుంది. అందుకే ఇంటి చిట్కాలతో ఫేస్ టోనర్ లా బియ్యం పిండి నీటితో తయారు చేసిన ఐస్ క్యూబ్స్ ని ముఖానికి అప్లయ్ చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. దీనిని ఎలా ఫ్రిపేర్ చేయాలంటే..చర్మానికి బియ్యం వల్ల ముఖ కాంతి పెరగడమే కాకుండా వడదెబ్బకు చికిత్సగా పనిచేస్తుంది. అలాగే ముఖ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. కళ్ళ కింద ఉబ్బినట్టుగా ఉంటే ఈ టోనర్ తో మంచి ఉపశమనం కలుగుతుంది. చర్మం జిడ్డుతనాన్ని తగ్గిస్తుంది. మెటిమలు, బ్లాక్ హెడ్స్, డార్క్ సర్కిల్స్ కి కూడా మంచి పరిక్షారం గా ఇది పనిచేస్తుంది. అయితే ఈ బియ్యం నీటిని గడ్డకట్టించి, ఐస్ క్యూబ్స్ గా అప్లై చేయడం వల్ల ఫలితం బావుంటుంది.

ఈ క్యూబ్స్ ని తయారు చేయడానికి...

బియ్యాన్ని వేడి నీటిలో వేసి మంట మీద ఉంచాలి. అన్నం ఉడుకుతున్న సమయంలో ఆ నీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ నీటిని ఐస్ క్యూబ్స్ గా గడ్డ కట్టించడం వల్ల ముఖ చర్మం కాంతి వంతంగా మారుతుంది.

ఇలా కూడా చర్మానికి టోనర్ తయారు చేయవచ్చు.

బియ్యాన్ని పులియబెట్టి కూడా ఈ టోనర్ ను తయారు చేయవచ్చు.. దీని కోసం బియ్యాన్ని నీటిలో నానబెట్టి ఉంచాలి. ఇప్పుడు బియ్యాన్ని విడిగా ఫిల్టర్ చేసి, ఈ నీటిని 2 నుండి 3 రోజులు మూతపెట్టి ఉంచండి. ఈ పులియబెట్టిన బియ్యం నీటిని ఐస్ క్యూబ్స్ గా తయారుచేసి ముఖానికి అప్లై చేయవచ్చు.

ఇది కూడా చదవండి: పాతికేళ్ల వయసుకే తెల్ల జుట్టు వచ్చేసిందా..? జుట్టు రాలిపోతోందా..? కరివేపాకులే ఓ అద్భుతమైన మెడిసిన్ అని తెలుసా..?


రైస్ ఐస్ క్యూబ్స్ ప్రయోజనాలు

1. రైస్ వాటర్ ఐస్ క్యూబ్స్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మొదటి ప్రయోజనం ఏమిటంటే ఇది ముఖానికి యాంటీ ఏజింగ్ లక్షణాలను ఇస్తుంది. ఈ నీటిలో యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి వృద్ధాప్యాన్ని దరిచేయనీయవు.

2. ముఖంపై లోతైన గుంటలు ఉంటే, ఈ ఐస్ క్యూబ్స్ ఈ రంధ్రాలను చిన్నవిగా చేస్తాయి.ఈ రైస్ ఐస్ క్యూబ్స్‌తో ముఖం లేదా కళ్లపై వాపు సమస్య కూడా తగ్గుతుంది.

Updated Date - 2023-08-23T16:04:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising