ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heroine Rashmika : రెండు పాటలు చాలు కదా!

ABN, First Publish Date - 2023-01-21T23:27:36+05:30

ఈ మధ్య ‘వారసుడు’లో మెరిసింది రష్మిక. అయితే ఈ సినిమాలో రష్మిక పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. పాటల్లో మెరిసిందంతే. సన్నివేశాలు కూడా చాలా తక్కువ. ఓ స్టార్‌ కథానాయిక అయ్యిండి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ మధ్య ‘వారసుడు’లో మెరిసింది రష్మిక. అయితే ఈ సినిమాలో రష్మిక పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. పాటల్లో మెరిసిందంతే. సన్నివేశాలు కూడా చాలా తక్కువ. ఓ స్టార్‌ కథానాయిక అయ్యిండి... ఏమాత్రం గుర్తింపు లేని పాత్రలో ఎందుకు నటించిందంటూ విమర్శకులు పెదవి విరిచారు. ఇప్పుడు ఇదే ప్రశ్న రష్మికకు ఎదురైంది. దానికి తెలివైన సమాధానం ఇచ్చింది రష్మిక. ‘‘ఈ సినిమాలో నా పాత్రకు ఎలాంటి గుర్తింపూ లేదని నాక్కూడా తెలుసు. అన్నీ తెలిసే ఈ సినిమా ఒప్పుకొన్నా. ఎందుకంటే విజయ్‌కు నేను వీరాభిమానిని. ఆయన సినిమాలో నేను భాగం పంచుకొంటే చాలనిపించింది. పైగా ఏ సినిమాలో అయినా రెండు మంచి పాటలు చాలు. అదరగొట్టడానికి. నాకు ఈ సినిమాలో అలాంటి పాటలు దొరికాయి. ఆ రెండు పాటలకూ మంచి గుర్తింపు వచ్చింది. కేవలం పాటలు, డాన్సులు కోసమే ఈ సినిమా చేశా. కొన్ని కొన్నిసార్లు అంతే. ఓ ప్రాజెక్టు నచ్చితే అందులో నా భాగం ఎంత? ఎన్ని సన్నివేశాల్లో ఉంటాను? ఇలాంటి విషయాల గురించి పెద్దగా ఆలోచించను. ‘ఈ సినిమాలో నా పాత్రకు ఎలాంటి గుర్తింపు లేకపోయినా కేవలం మీ కోసమే చేస్తున్నా..’ అని షూటింగ్‌ సమయంలో విజయ్‌తో కూడా చెప్పా. ఆయనేమో నవ్వేసేవాడు’’ అని గుర్తు చేసుకొంది రష్మిక.

Updated Date - 2023-01-21T23:27:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising