ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vastu Tips: భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలేనా..? బెడ్రూంను వెంటనే ఇలా మార్చేయండి..!

ABN, First Publish Date - 2023-08-19T15:58:35+05:30

సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని నిర్ధారించడానికి వేటినైనా జంటగా మాత్రమే గదిలో ఉంచాలి.

south direction

వాస్తు శాస్త్రం ప్రేమను పెంచడమే కాదు... దంపతుల మధ్య అనుకూలతను మెరుగుపరుస్తుంది. ఉంటున్న ఇంట్లో వాస్తు పరమైన మార్పులు ఏమన్నా అవసరం అవుతాయేమో కూడా గమనించడం ముఖ్యం. దంపతుల మధ్య చిన్న చిన్న గిల్లికజ్జాలు వస్తూనే ఉంటాయి. ఇవి మరీ ఎక్కువైతే మాత్రం వాటికి వాస్తుపరమైన దోషాలున్నాయేమో గమనించుకోవాలి. భార్యాభర్తల ఇద్దరిమధ్యా ప్రశాంతమైన, ప్రేమ, అన్యోన్యతతో కూడిన వాతావరణం ఉండాలి. దీనికి వారి పడకగది కూడా చాలా దోహదం చేస్తుంది. ఒక జంటకు వివాహం అయ్యి ఎంతకాలం అయిందనేది ముఖ్యం కాదు, వారి బంధం ఎంత అన్యోన్యంగా సాగుతుంది అనేది ముఖ్యం. దీనికి వాస్తు పరమైన చిట్కాలను అనుసరించడం మేలు చేస్తుంది.

పడకగదికి వాస్తు చిట్కాలు

గది అమరిక : మాస్టర్ బెడ్‌రూమ్ బెడ్‌ను ఖచ్చితంగా దక్షిణం లేదా నైరుతి దిశలో ఉండాలి. మధ్యలో ఉండకూడదు ఎందుకంటే అది వైవాహిక సమస్యలను సృష్టిస్తుంది. గదంతా దీర్ఘచతురస్రాకార అమరికలో ఉండాలి. అలాగే దంపతులు ఎప్పుడూ దక్షిణం వైపు తల పెట్టి నిద్రించాలి.

మెటల్ బెడ్‌ వద్దు : దంపతులు నిద్రపోయేందుకు ఈ మధ్య కాలంలో వస్తున్న మెటల్ బెడ్స్ వాడకూడదు. ఈ బెడ్ భార్యాభర్తల మధ్య వివాదానికి కారణమవుతుంది. ఎప్పుడూ చెక్కతో చేసిన బెడ్‌ను మాత్రమే వేయాలి.

మిర్రర్ ఎటువైపంటే : మంచానికి నేరుగా ఎదురుగా అద్దాన్ని ఉంచకూడదు. అద్దం సైజ్ పెరిగిన కొద్దీ వైవాహిక జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది.


ఇది కూడా చదవండి: పళ్లు పచ్చగా అవడం మొదలైందా..? మెడిసిన్స్ అక్కర్లేదు.. ఈ చిట్కాతో ముత్యాల్లా మెరవడం ఖాయం..!


ఇంటీరియర్ : గది ఈశాన్య మూలలో రద్దీగా ఉండకూడదు. ఉత్తర మూలలో ఇండోర్ మొక్కలు, తెలుపు పువ్వులు, నైరుతిలో ఊదా, ఎరుపు గులాబీలను ఉండటం వల్ల జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా గదిలో ఒకే సీతాకోకచిలుక, లేడి వంటి అలంకరణ వస్తువులు ఉండకూడదు. జంటగా ఉండేలా చూసుకోవాలి. ఇది ప్రేమను సూచిస్తుంది. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని నిర్ధారించడానికి వేటినైనా జంటగా మాత్రమే గదిలో ఉంచాలి.

ఫోటో ప్లేస్‌మెంట్ : ఇంటి పశ్చిమ దిశలో అందమైన ఫోటోను వేలాడదీయండి. ఇది ఇద్దరి మధ్య ప్రేమ, అనుకూలతను పెంచడంలో సహకరిస్తుంది.

గోడల రంగు : పడకగదిలోని నైరుతి గోడను పింక్, పీచు రంగులలో పెయింటింగ్ చేయండి. ఈ రంగులు గదిలో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.

Updated Date - 2023-08-19T15:58:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising