Vastu Tips: వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోతోందా..? ఇంట్లో ఎప్పుడు చూసినా లక్ష్మీ దేవి కళకళలాడాలంటే..!
ABN, First Publish Date - 2023-08-19T16:40:47+05:30
ఇంటి వాతావరణం వాస్తు ప్రకారం ఉండేట్టు చూసినా ఇంటిలోపలి వాతావరణంలో సమతుల్యత లేకపోతే లక్ష్మీ కటాక్షం ఉండదు.
ఇంటికి కళను, ఆనందాన్ని ఇచ్చేది లక్ష్మీ కటాక్షం. అందుకు సంపదతో పాటు శ్రేయస్సును ఆకర్షించడంలో వాస్తు శాస్త్రం అవసరం. ప్రతి ఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైన అంశం డబ్బు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఆర్థిక సమృద్ధిని ఆకర్షించాలంటే, అగ్ని, నీరు, భూమి, గాలి, ఆకాశం ప్రకృతి ఐదు ప్రాథమిక అంశాలను శాంతింపజేయాలి. ఈ ఐదు అంశాలలో ఏ ఒకటి సమతుల్యతలో లేకపోయినా ఇంటి వాతావరణంలో మార్పులతో పాటు, పెద్ద సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఇంటి వాతావరణం వాస్తు ప్రకారం ఉండేట్టు చూసినా ఇంటిలోపలి వాతావరణంలో సమతుల్యత లేకపోతే లక్ష్మీ కటాక్షం ఉండదు. దీనికి కొన్ని వాస్తు సూత్రాలను తప్పక పాటించాలి.
డబ్బు, శ్రేయస్సును ఆకర్షించడానికి వాస్తు సూత్రాలు
ఆగ్నేయ దిశలో రాగి స్వస్తిక్ గుర్తును ఉంచండి: ఇంట్లో ఆగ్నేయ దిశలో రాగి స్వస్తిక్ ఉంచాలి. ఇది ధన స్థితికి సహకరిస్తుంది. అన్ని అడ్డంకులను తొలగిస్తుంది.
మనీ బాక్స్ ఉత్తర దిశలో ఉంచండి: నీలం రంగు మనీ పెట్టె ఉత్తరం వైపుగా ఉంచాలి. దానిపై కమలం ఫోటోను అతికించండి. క్రమం తప్పకుండా ఈ డబ్బాలో డబ్బును వేయడాన్ని క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.
డస్ట్‌బిన్‌లను మార్చండి: ఉత్తరం, పశ్చిమం లేదా ఆగ్నేయంలో చెత్త డబ్బాలు, స్క్రాప్‌లు ఉంచకండి. ఇది ప్రతికూల శక్తిగా మారి మన జీవితంలోని ఆర్థిక అంశాలకు అంతరాయం కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి: భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలేనా..? బెడ్రూంను వెంటనే ఇలా మార్చేయండి..!
పశ్చిమ దిశలో భద్రపరచండి : ముఖ్యమైన కాగితాలు, డబ్బు, ఆభరణాలు అన్నీ ఇంటికి పడమర దిశలో ఉంచాలి.
ఇంటిని శుభ్రంగా ఉంచండి: వాస్తు శాస్త్రం చక్కని సూత్రాలు పాటిస్తే.. కుటుంబ సంబంధాలు, శ్రేయస్సు, ఆర్థిక వ్యవహారాలను ఎలా నిర్వహించాలో ఇంటిలోని అనుకూల శక్తి నిర్ణయిస్తుంది. కాబట్టి, లివింగ్ రూమ్, బెడ్‌రూమ్, కిచెన్, రూఫ్‌టాప్‌లు, బాల్కనీలు ప్రవేశాలతో సహా అన్ని గదులను శుభ్రంగా ఉంచుకోవాలి.
Updated Date - 2023-08-19T16:40:47+05:30 IST