ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

How to Look Slim : ఎంత లావుగా ఉన్నా సరే.. ఈ టిప్స్ పాటిస్తే స్లిమ్‌గా కనిపిస్తారు..

ABN, First Publish Date - 2023-02-18T10:41:07+05:30

సన్నగా.. మల్లెతీగలా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ వ్యాయామం, ఫుడ్ విషయంలో కంట్రోల్ చేయలేక కొందరు.. చేసినా ఫలితం ఉండక మరికొందరు బొద్దుగానే ఉండిపోతారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

How to Look Slim : సన్నగా.. మల్లెతీగలా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ వ్యాయామం, ఫుడ్ విషయంలో కంట్రోల్ చేయలేక కొందరు.. చేసినా ఫలితం ఉండక మరికొందరు బొద్దుగానే ఉండిపోతారు. మన తాతల నాటి కాలంలో అయితే బొద్దు ముద్దే.. అందుకే అలనాటి హీరో, హీరోయిన్స్ కూడా బొద్దుగా ఉన్నా వారికి స్టార్ స్టేటస్ దక్కింది. కానీ ఇప్పుడు బొద్దుగా ఉంటే కుదురుతుందా? మనం తీసుకోలేనన్ని జోక్స్ పడతాయ్. మరి స్లిమ్‌గా కనిపించాలంటే ఏం చేయాలి? అంటే మన డ్రెస్సింగ్ విధానంలో మార్పు చేసుకుంటే కొంతమేర తగ్గినట్టుగా కనిపించవచ్చు. మీరు మామూలు డ్రెస్‌ల్లో కనిపించే దానికంటే కొన్ని స్పెషల్ డ్రెస్సుల్లో చాలా స్లిమ్‌గా కనిపిస్తారు. అవేంటో తెలుసుకుందాం.

సన్నగా కనిపించడానికి ఎలా దుస్తులు ధరించాలి

1. బొద్దుగా ఉన్నవారు వర్టికల్ లైన్స్ ఉన్న దుస్తులను ఎంచుకోవాలి. నిలువు గీతలు మనం పొడవుగా కనిపించేలా.. అలాగే స్లిమ్‌గా కనిపించేలా చేస్తాయి. దీనిపై మహిళలైతే జువెలరీ ధరించాలంటే లాంగ్ నక్లెస్ లేదంటే స్కార్ఫ్‌ని ధరించండి.

2. ఫిట్‌గా ఉన్న దుస్తులను మాత్రమే ధరించండి. ఫిట్‌గా ఉన్న దుస్తుల్లో చాలా స్లిమ్‌గా కనిపిస్తాం. బ్యాగీ దుస్తులను అవాయిడ్ చేయండి. వీటి కారణంగా మరింత లావుగా కనిపించే అవకాశం ఉంది.

3. ముదురు రంగులనే వాడండి. ఇవి మన శరీరంలో ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను దాచేసి చాలా స్లిమ్‌గా కనిపించేలా చేస్తాయి. ముఖ్యంగా బ్లాక్, నేవీ బ్లూ, డార్క్ గ్రే వంటి కలర్స్‌ను ధరించడం వల్ల చాలా స్లిమ్‌గా కనిపిస్తారు.

4. బెల్ట్‌తో యాక్సెస్ చేయండి. బెల్ట్ అనేది మన నడుమును సన్నగా కనిపించేలా చేస్తుంది.

5. మీ దుస్తులను లేయర్ చేయండి. స్లిమ్‌గా కనిపించాలంటే లేయర్ ఉన్న దుస్తులను ధరించడం తప్పనిసరి. ఉదాహరణకు, బ్లేజర్‌తో కూడిన షర్ట్.. దానిపై ఫిట్‌గా ఉన్న కార్డిగాన్ ధరిస్తే చాలా స్లిమ్‌గా.. అందంగా కనిపిస్తారు.

6. అడ్డ గీతలు ఉన్న దుస్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకండి. ఇవి మరింత లావుగా కనిపించేలా చేస్తాయి.

7. ఇక చెప్పుల విషయానికి వస్తే.. వీలైనంత మేర హీల్స్ ధరించండి. హీల్స్ మీ కాళ్లు పొడవుగా కనిపించేలా చేస్తాయి. తద్వారా మీరు కూడా స్లిమ్‌గా కనిపిస్తారు.

Updated Date - 2023-02-18T10:41:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising