ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tiruppavai: మహాబలిపురంలోని ఒక గుహాలయంలో ఆ శిల్పం...

ABN, First Publish Date - 2023-01-01T22:33:32+05:30

ఆడవాళ్లు బంతి ఆట ఆడుకోవడం మనకు తెలిసిందే. రామాయణంలో సీత బంతి ఆట... ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన: రోచిష్మాన్

Andal Tiruppavai Pasuram 18
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో‌ తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి‌ ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం పద్దెనిమిదోరోజు; తిరుప్‌పావై పద్దెనిమిదో పాసురమ్ రోజు.

పాసురమ్ 18

ఆణ్డాళ్, కృష్ణుడి ఇంటికెళ్లి నందగోపాలుణ్ణీ, యశోదనూ, కృష్ణ , బలరాముల్నీ మేలుకోమని అన్నాక కృష్ణుడి భార్య 'నప్పిన్నై' ను తలుపు తియ్యమంటూ ఇదిగో ఈ పద్దెనిమిదో పాసురానికి పలుకును ఇచ్చింది ఇలా...

మూలం-

ఉన్దు మదకళిఱ్ట్రన్ ఓడాద తోళ్ వలియన్

నన్దగోబాలన్ మరుమగళే నప్పిన్నాయ్!

గన్దమ్ కమళ్షుమ్ కుళ్షలి కడై తిఱవాయ్;

వన్దెఙ్గుమ్ కోళ్షి అళ్షైత్తన కాణ్; మాదవిప్

పన్దల్ మేల్ పల్‌కాల్ కుయిలినఙ్గళ్ కూవిన కాణ్;

పన్దార్ విరలియున్ మైత్తునన్ పేర్‌పాడచ్

చెన్దామరైక్ కైయాల్ సీరార్ వళైయొలిప్ప

వన్దు తిఱవాయ్ మగిళ్ష్‌న్దేలోరెమ్‌పావాయ్!

తెలుగులో-

మదపుటేనుగులున్న వాడు, మడమతిప్పని వాడు, బలమైన భుజాల వాడైన

నందగోపాలుడి కోడలా ఓ నప్పిన్నై!

పరిమళిస్తున్న కేశాలదానా! తలుపు తియ్యి;

కోళ్లు వచ్చి పిలుస్తున్నాయి చూడు; మల్లె

పందిరిపైన కోయిలలు కూస్తున్నాయి చూడు;

బంతి ఆడేదానా! నీ మొగుడి నామగానం చేస్తుండగా,

ఎఱ్ఱతామరల్లాంటి నీ చేతులకున్న అందమైన గాజులు చప్పుడు చేస్తూండగా

వచ్చి సంతోషంగా తలుపు తియ్యి; ఓలాల నా చెలీ!

అవగాహన-

అతిబలవంతుడైన నందగోపుడి కోడలా అంటూ కృష్ణుడి భార్య నప్పిన్నైను తలుపు తియ్యమని పొలుపుగా పిలుస్తోంది ఆణ్డాళ్.

నప్పిన్నై కృష్ణుడి భార్యా? ఈ నప్పిన్నై మనకు భాగవతం, ఇతర కృష్ణోదంతాలలో లేదు‌. సంస్కృత భక్తి సాహిత్యంలో లేదు‌. చాలపాత తమిళ్ష సాహిత్యంలో నప్పిన్నైను కృష్ణుడి భార్యగా చెప్పారు. ఆళ్ష్వారులకన్నా ముందున్న తమిళ్ష్ భక్తి సాహిత్యంలో ఈ నప్పిన్నై ప్రస్తావన ఉంది. విష్ణువు భార్యల్లో ఒకరు నీళాదేవి. ఆ నీళాదేవి అవతారమే నప్పిన్నైగా తమిళ్ష్ భక్తిసాహిత్యంలో చెప్పారు. మహాబలిపురంలోని ఒక గుహాలయంలో నప్పిన్నై శిల్పం ఉంది. దక్షిణ తమిళ్షనాడులోని కొన్ని వైష్ణవాలయాల్లో నీళాదేవి శిల్పాలు కనిపిస్తాయి.

పూలు పెట్టుకోవడంవల్ల కేశాలు పరిమళిస్తాయి కాబట్టి "పరిమళిస్తున్న కేశాలదానా" అని‌ చెప్పడం జరిగింది. "కోళ్లు వచ్చి పిలుస్తున్నాయి చూడు; మల్లె పందిరిపైన కోయిలలు కూస్తున్నాయి చూడు" అన్న మాటలతో అక్కడి సన్నివేశానికి చిత్రణ జరిగింది. ఒక చక్కటి చిత్రం మన కళ్లముందు కదలాడింది‌.

సూర్యోదయానికి రెండున్నర గంటల ముందు‌ బ్రహ్మముహుర్తంలో కోడి కూస్తుంది. అదే సమయంలో‌ కోయిలా కూస్తుంది. ఆణ్డాళ్ ఆ విషయాన్నే‌ చెబుతోంది ఇక్కడ. వైష్ణవ సాంప్రదాయిక సాహిత్యంలో "కుయిల్ కూవి తుయిల్ ఎళ్షుప్ప" అంటే కోయిల కూసి నిద్రలేపగా అని అనడం ఉంది.

ఆడవాళ్లు బంతి ఆట ఆడుకోవడం మనకు తెలిసిందే. రామాయణంలో సీత బంతి ఆట అడడం మనం చదివిందే. "బంతి ఆడేదానా, నీ మొగుడి నామగానం చేస్తుండగా, ఎఱ్ఱతామరల్లాంటి నీ చేతులకున్న అందమైన గాజులు చప్పుడు చేస్తూండగా వచ్చి సంతోషంగా తలుపు తియ్యి" అని అంది ఆణ్డాళ్. నామగానానికి గాజుల చప్పుడు తోడవడం అన్న భావన చాలగొప్పగా ఉంది. తన మొగుణ్ణి భక్తులు స్తుతిస్తూంటే దానికి తన చేతి గాజుల చప్పుడు తోడవడం భార్యకు సంతోషకరమే. గొప్పతనం విప్పారేట్టు‌ చెప్పింది ఆణ్డాళ్.

ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్

తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి

రోచిష్మాన్

9444012279

Updated Date - 2023-01-02T06:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising