ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tiruppavai: మా పిలుపులు అలా ఉండుంటే కోప్పడకు...

ABN, First Publish Date - 2023-01-11T23:05:02+05:30

భగవంతుడితో బంధుత్వాన్ని పొందడం భక్తుల లక్ష్యం. భక్తులు ఎప్పటికీ దైవానికి వీడిపోని బంధువులు... ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన: రోచిష్మాన్

Andal Tiruppavai Pasuram 28
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో‌ తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి‌ ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం ఇరవయ్యెనిమిదోరోజు; తిరుప్‌పావై ఇరవయ్యెనిమిదో పాసురమ్ రోజు.

పాసురమ్ 28

ఆణ్డాళ్ కృష్ణుడితో నీ గానం చేస్తూ కావాల్సినవి పొంది కలిసి ఉండి చల్లగా బతుకుతామని చెప్పుకున్నాక కొనసాగుతూ ఇరవయ్యెనిమిదో పాసురమ్‌లోకి వెళ్లింది; మనమూ వెళదాం రండి...

మూలం-

కఱవైగళ్ పిన్‌సెన్ఱు కానం సేర్‌న్దుణ్బోమ్;

అఱివొన్ఱుమ్ ఇల్లాద ఆయ్‌క్కులత్తు ఉన్దన్నై

పిఱవి పెఱున్దనై పుణ్ణియమ్ యాముడైయోమ్;

కుఱైవొన్ఱుమ్ ఇల్లాద గోవిందా! ఉన్దన్నోడు

ఉఱవేల్ నమక్కిఙ్గొళ్షిక్క ఒళ్షియాదు;

అఱియాద పిళ్ళైగళోమ్ అన్బినాల్ ఉన్దన్నై

సిఱుపేర్ అళ్షైత్తనవుమ్ సీరియరుళాదే;

ఇఱైవా! నీ తారాయ్ పఱైయేలోరెమ్‌పావాయ్!

తెలుగులో-

పాడిపశువుల్ని కాచుకుంటూ అడవిలో తింటాం;

ఏ మాత్రమూ చదువులేని గోపకులంలో నువ్వు

పుట్టడంవల్ల మాకు పుణ్యం వచ్చింది;

ఏ లోపమూలేని గోవిందుడా! నీతో ఉన్న

బంధం పోగొట్టుకున్నా పోదు;

ఎఱుకలేని పిల్లలం అనురాగంతో నిన్ను

అమర్యాదగా పిలిచినా కోప్పడకు;

భగవంతుడా! తప్పెటను ఇచ్చేసెయ్; ఓలాల నా చెలీ!

అవగాహన-

పశువుల్ని మేపుకునే పామరులం మేము అందువల్ల మా పిలుపులు అమర్యాదగా ఉండుంటే కోప్పడకు అని కృష్ణుడిని కోరుకుంటోంది ఆణ్డాళ్. ‌"నీతో ఉన్న బంధం పోగొట్టుకున్నా పోదు" అనడం ఒక ఉన్నతమైన భావానికి అభివ్యక్తి. 'భగవంతుడితో‌ ముడిపడి ఉన్నాం‌' అని అనుకోవడం ఉన్నతమైన స్థితి. భగవంతుడితో బంధుత్వాన్ని పొందడం భక్తుల లక్ష్యం. భక్తులు ఎప్పటికీ దైవానికి వీడిపోని బంధువులు.

అన్నమయ్య ఇలా అంటాడు:

"పామరుల కెంతైనా ఫలియించనేరదు

శ్రీమాధవ నీవు దయసేసితే నీడేరును"

'భగవంతుడి‌ దయ ఉంటేనే సిద్ధి కలుగుతుంది'. ఈ నిజం‌ తెలిసిన ఆణ్డాళ్ "భగవంతుడా! తప్పెటను ఇచ్చేసెయ్" అని అడుగుతూ అనుగ్రహాన్ని అభ్యర్థిస్తోంది. ‌దైవానుగ్రహాన్ని పొందడమే సిద్ధిపొందడం. రెండోపాసురమ్‌లో "సిద్ధిపొందాలనుకుని‌ సంతోషిద్దాం" అని అన్న ఆణ్డాళ్ ఇక్కడ సూటిగా దైవాన్ని ఆ సిద్ధిని ఇచ్చెయ్యమంటోంది.

భక్తి లోతుల్లోకి వెళ్లి అక్కడ మసలూతూ ఉండే పురుషుణ్ణి 'ఆళ్ష్-వార్ ' అనీ, మహిళను 'ఆళ్ష్-వాళ్' అనీ (తమిళ్ష్ భాషలో) అంటారు. ఆ ఆళ్ష్-వాళ్‌‌ ఈ 'ఆణ్డాళ్. ఒక ఆణ్డాళ్‌గా నీతో ఉన్న బంధం పోగొట్టుకున్నా పోదు‌ అని దైవంతో చెప్పుకుంటోంది.

ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్

తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి

రోచిష్మాన్

9444012279

Updated Date - 2023-01-12T07:35:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising