ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tiruppavai: మహోన్నతమైన భక్తులు మాత్రమే ఇలా...

ABN, First Publish Date - 2023-01-12T23:19:32+05:30

లేసంజలో వచ్చి నిన్ను పూజించి, నీ బంగారు పాదాల్ని కీర్తిస్తున్నది ఎందుకంటే.... ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన: రోచిష్మాన్

Andal Tiruppavai Pasuram 29
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామాన్యులమూ, పామరులమూ అయిన మాకు అనుగ్రహాన్ని ఇచ్చేసెయ్ అని భగవంతుణ్ణి అడిగాక ఆణ్డాళ్ ఇరవైతొమ్మిదో పాసురమ్‌గా ఇంకేం కావాలో కూడా అడుగుతోంది; ఇలా...

పాసురమ్ 29

మూలం-

సిఱ్ట్రఞ్‌సిరుకాలే వన్దున్నైచ్ చేవిత్తున్

పొఱ్ట్రామరైయడియే పోఱ్ట్రుమ్ పొరుళ్ కేళాయ్;

పెఱ్ట్రమ్ మెయ్తుణ్ణుమ్ కులత్తిల్ పిఱన్దు నీ

కుఱ్ట్రేవల్ ఎఙ్గళైక్ కొళ్ళామఱ్పోగాదు;

ఇఱ్ట్రైప్ పఱైకొళ్వాన్ అన్ఱుకాణ్ గోవిందా!

ఎఱ్ట్రైక్కుమ్ ఏళ్షేళ్ష్ పిఱవిక్కుమ్ ఉన్దన్నోడు

ఉఱ్ట్రోమే యావోమ్; ఉనక్కేనామ్ ఆట్సెయ్‌వోమ్

మఱ్ట్రై నమ్‌కామఙ్గళ్ మాఱ్ట్రేలోరెమ్‌పావాయ్!

తెలుగులో-

లేసంజలో వచ్చి నిన్ను పూజించి నీ

బంగారు పాదాల్ని ఎందుకు కీర్తిస్తున్నామో విను;

గోవుల్ని మేపుకుని పొట్టపోసుకునే కులంలో‌ పుట్టిన నువ్వు

చిన్న చిన్న ఉపచారాల్ని చేస్తున్న మమ్మల్ని స్వీకరించకుండా ఉండద్దు;

ఈనాడు తప్పెటను తీసుకోవడానికి మాత్రమే కాదని గ్రహించు గోవిందా!

ఏనాటికీ, ఏడేడుజన్మలకూ నీతో

బంధుత్వం కలవాళ్లమై ఉంటాం, నీకే సేవ చేస్తూంటాం;

మా తక్కిన కోరికల్ని తొలగించెయ్; ఓలాల నా చెలీ!

అవగాహన-

మేము పశువుల్ని మేపుకునే పామరులం, అని క్రితం‌ పాసురమ్‌లో చెప్పినదానికి కొనసాగింపుగా ఇక్కడ "చిన్న చిన్న ఉపచారాల్ని చేస్తూ ఉన్న మమ్మల్ని స్వీకరించకుండా ఉండద్దు" అంటూ కృష్ణుణ్ణి వేడుకుంటోంది ఆణ్డాళ్.‌

"ఈనాడు తప్పెటను తీసుకోవడానికి మాత్రమే కాదని గ్రహించు గోవిందుడా" అంటూ లేసంజలో వచ్చి నిన్ను పూజించి, నీ బంగారు పాదాల్ని కీర్తిస్తున్నది ఎందుకో వినమని "ఏనాటికీ, ఏడేడు జన్మలకూ నీతో బంధుత్వం కలవాళ్లమై ఉంటాం, నీ సేవ చేస్తూంటాం" అని చెబుతోంది ఆణ్డాళ్. "మా తక్కిన కోరికల్ని తొలగించెయ్" అని కృష్ణుణ్ణి ప్రార్థిస్తోంది ఆణ్డాళ్. ఇది మహోన్నతమైన ప్రార్థన! ఆణ్డాళ్ వంటి మహోన్నతమైన భక్తులు మాత్రమే ఇలా దైవాన్ని ప్రార్థించగలరు!! నీతో బాంధవ్యం వినా మా మఱో‌ కోరికను తొలగించెయ్ అని దైవాన్ని ప్రార్థించడం పండిన భక్తికి తార్కాణం. ఇది పూర్తిగా భగవంతుడితో సమన్వయ్వం అయ్యే స్థితి. "తత్తు సమన్వయాత్" అని ఒక బ్రహ్మసూత్రం (1-1-4) తెలియజేస్తోంది. అంటే బ్రహ్మం సమన్వయంవల్లే (సుసాధ్యమౌతుంది) అని. ఇక్కడ సమన్వయం అంటే సంయోగం అని అర్థం. మఱే కోరికా లేకుండా దైవంతో సంయోగస్థితిని కోరుకుంది ఆణ్డాళ్.

ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్

తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి

రోచిష్మాన్

9444012279

Updated Date - 2023-01-13T11:00:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising